పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

కవికోకిల గ్రంథావళి


యుపన్యాసము నొక పాత్రమునోటఁ జెప్పించి నాట్యశాలను రాజకీయోపన్యాస మందిరముగ మార్చుట; పుట్టినదాది అడవులలోఁ గాలము పుచ్చుచు, గ్రంథములలో వర్ణింపఁ బడిన లక్షణములచేత గుఱ్ఱమును గుర్తించిన కుశలవులు మాతృదేశాభిమానమును గుఱించి నేఁటికాలపు భావముల వెడలఁగ్రక్కు ఉపన్యాసముల బలాత్కారముగ ప్రేక్షకులపైఁ గురిపించుటచూడ, “ఆంధ్ర పత్రిక " వాల్మీకి ఆశ్రమమునకుఁ గూడఁ బంపబడుచున్న దా యను భ్రాంతి పొడముచున్నది. దేశకాలపాత్ర విరుద్ధమైనను పురాతన వస్తువునకు ఆధునిక వాసన దగిలించుట చాలమంది నాటక రచయితల కభ్యాసమైయున్నది. ఇది యొక వ్యాపార రహస్యము.

చాలమంది నాటకకవుల రచనాలోపములను, పాటలును బద్యములును గప్పిపుచ్చుచున్నవి. నాటకములోని కల్పనను బృథక్కరించినయెడల ఆ లోపములు బయలుపడును. ఎట్టినాటకమునైనను జక్కఁగా బాడఁగలిగిన యొకరిద్దఱు సటకుల నాశ్రయించి ప్రసిద్ధికి రావచ్చును. అల్లూరు నాటక సమాజమువారు రామదాసు నాటకమును బ్రదర్శించు చుందురు. పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి గారు (ఆ సమాజమునఁ బ్రధాన నాయక పాత్రము ధరించు నటకుఁడు) కబీరు పాత్రమును ధరింతురు. ఆ ప్రదర్శనములను జాలమంది కొనియాడుచుందురు. రెడ్డిగారు నాట్య ప్రపంచమున ఆర్జించిన పేరు ప్రతిష్టలకు ఆ నాటకము పట్టుఁగొమ్మ. ప్రజల ప్రశంసకు నాస్పదమైన విషయము నెఱుంగవలయునని చాలమంది యభిప్రాయములను గనుగొంటిని. కొంచె మించుమించుగ