పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

97


పాటయందు, 'సుకుమారా-గుణశాలి' అను పాటయందును “ రామకృష్ణకవిరత్నముఁ బ్రోవ' అనియు 'కవి రామకృష్ణ' అనియు, కవిగారు తన పేరును ఇముడ్చుకొన్నారు. అచ్చట ఒక చుక్క గుర్తును బెట్టి జ్ఞాపికలో 'లీలావతి యీ పాట చదువునప్పుడు ఆంకితము పేరును తీసివేయవలయును' అని యైన హెచ్చరించలేదు. నటకలును ఆ యంకితముయొక్క యనౌచిత్యమును గ్రహింపలేదు. లీలావతి పాత్రము ధరించిన యొక నటకుఁడు 'రామకృష్ణకవిరత్నము.' అని పాడుచుండగా విని నేను ఆశ్చర్యపడితిని. లీలావతిని ఇంద్రునివలె చెంగుపట్టుకొని రామకృష్ణకవి కాలమునకు లాగవలయునో, లేక కవినే లీలావతి కాలమునకు నెట్టవలయునో, తోఁపకున్న ది. అట్లు చేసినను లీలావతి రామకృష్ణకవిపేరు నేల స్మరింప వలయునో నా కనూహ్యముగ నున్నది. నాటకములో కవి దాఁగియుండవలయు నేకాని ముక్కు వెళ్ళఁబెట్టవలసిన యావశ్యకత లేదు. అట్టినాటకముల నాదరించు నభిరుచిగల మనము కాళిదాసాదుల నాటకముల నెట్లు మెచ్చుకొనగలము?

'నాటకము చాల బాగుగానున్నది' అని యనిపించు కొనుటకు మఱియొక యుపాయము గలదు. స్థానికమైనను అస్థానికమైనను దేశభక్తి దేశానుసారము మున్నగుభావములను వెండ్రుకపట్టు మాత్రమైనను సందు కల్పించుకొని బారెడుపొడుగు ఉపన్యాసములోఁ బొదిపి ప్రవేశపెట్టుట; హిందువులు మహమ్మదీయులు కలిసియున్న నాటకకథయైన యెడల [ఆ కథ జరుగు. కాలమందు అట్టిభావములు ప్రజలలో లేకున్నను] హిందూ మహమ్మదీయమైత్రిని గుఱించిన