పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మాల]

జాతీయగీతము

69


విప్లవ ఝంఝా విచలిత జీవన
     వీచి నికాయమున,
స్థిర విజయోడుప కర్ణ ధారణము
     సేయుమ శౌర్యమున.
జొహార్ ! జొహార్ ! భారతమాతా,
జొహార్ ! జొహార్ ! జొహార్!

ముకుళిత హస్తులు నీప్రియపుత్రులు
     మోదదృష్టిఁ గనుము,
నీకరుణామృత నిర్ఘరపూరము
     నింపు మమ్మ సతము
జొహార్ ! జోహార్ ! భారతమాతా,
జోహార్ ! జొహార్ ! జోహార్ !

నీపదపీఠిని ప్రాణసుమంబులు
     నిల్పి భజించెదము,
గర్హిత దాస్య భరంబును మాన్పి
     సుఖంబులు మా కిడుము.
జొహార్ ! జోహార్ ! భారతమాతా,
జొహార్! జొహార్ ! జొహార్!

__________