పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిజాతీయగీతము.

జొహార్ ! జొహార్ ! భారతమాతా,
    జొహార్! జొహార్ ! జొహార్!
        శారద శుభ్ర వియత్తల పధమున
              సంచరించు నీరథము,
       నీ మృదు వీణాగాన ప్రబుద్ధము
             నిత్యము మామనము.
     జొహార్ ! జొహార్ ! భారతమాతా,
     జొహార్ ! జొహార్ ! జొహార్!

        ప్రత్యుషలక్ష్మీ మకుటమణి ప్రభఁ
              బాసె తమోగణము,
       నీపదపంకజ నూపుర ఝుంకృతి
             నిద్రారహితము జనము.
    జోహార్ ! జొహార్ ! 'భారతమాతా,
    జొహార్ ! జొహార్ ! జొహార్ !