పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



విన్నపము.

1916 మొదలు 1933 వఱకు నేను రచించిన ఖండకావ్యము లన్నియు ఈ సంపుటమున సమకూర్పఁబడినవి. వ్రాత ప్రతులను బట్టి, ఆయా ఖండకావ్యములను రచించిన తేదులను ఇందు పొందుపఱచితిని. 1921 లో 'నక్షత్రమాల' ప్రకటింపఁ బడినపుడు ఆసంపుటమునకు నేను రచించిన ఉపోద్ఘాతము ఈ ఖండకావ్య సంపుటమునకును ఉచితముగ నుండును గాన దాని నట్లే యుండనిచ్చితిని.

మోపూరు నివాసులును కళోపాసకులును కవితా రసజ్ఞులును నాకు మిత్రులును అగు

శ్రీయుత రేబాల సుబ్బరామిరెడ్డిగారు

ఒకనాఁడు ప్రస్తావ వశమున నిట్లనిరి:

నీగ్రంథములు చెల్లా చెదరుగ నున్నవి. మాసపత్రికలలో ప్రకటింపబడిన కొన్ని కావ్యములు గ్రంథరూపమున వెలువడనే లేదు. తుదకు నీపుస్తకములు ఎచ్చట దొరకునోయను సంగతికూడ చాలమందికి తెలియదు. నీకృతులన్నియు ఒకే సంపుటముగ నచ్చొత్తించిన బాగుగనుండును. నీ విష్టపడుదు వేని నేనందుకు వలసిన యేర్పాటు కావించెదను."