పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

64

కవికోకిల గ్రంథావళి

[నక్షత్ర


'డెలటాభూములఁ బైరులు
గలవని యచ్చోటిజనులు కౌతుకపడుచున్
వలసలువచ్చిరి ప్రాణం
బులు నిలువంబెట్టు నాస పొంపిరివోవన్ .

'నాకూఁతురు నాకొడుకును
నాఁకలి యెట్టిదియొ యెఱుఁగనట్టుల నన్నున్
సాఁకుచునుండిరి వేళకు
ఆకో అంబలియొ గలుగునంతకు నిడుచున్.

'ముసలితనమునందు ముప్పతిప్పలుగల్గెఁ
దమ్మిచూలివ్రాలు వమ్ముపడునె?
కొడుకుఁగూఁతు మొన్నఁ గ్రొత్తజ్వరంబుల
వాతఁబెట్టి నేన బ్రతికియుంటి.

'పండుటాకులురాల్చక పసరులొలుకు
పిన్నకనటల వెదకెఁ బాపిష్టిబ్రహ్మ !
ముసలిముదుకకు సంజీవి మెసవఁబెట్టి
విసముఁ దినఁబెట్టెఁ బ్రాయంపుఁ బిల్లలకును !