పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ధనముండుట పరిపాటియె;
ధనమే సర్వంబుగాదు; ధనముండియు స
ద్వినియోగ బుద్ధిగలిగిన
మనుజునిభాగ్యంబె లోకమాన్యతగాంచున్.

రమయు వాణియుఁ బక్షపాతమువహించి
కూర్చి రర్థంబు విద్యయుఁ గొదవలేక,
అట్టియొద్దిక యందఱ కబ్బదోయి,
జీవితార్థంబు నిరుకేలఁ జిక్కఁబట్ట!