పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



కృతజ్ఞత.

_______

బాల్యంబుననె కాన్యపనవీథి విహరించి
          కవికోకిలాలాప గతులుమెచ్చె;
సౌందర్యభావనాశబలిత చిత్తుఁడై
          స్వర్గతుల్య మొనర్చె స్వభవనమును;,
కలిమికి సహజమౌ గర్వంబువిడి మిత్ర
         బృందహృత్పీఠిక నెక్కఁ గలిగె;
అర్థికి గౌరవహాని దోఁపింపని
         దానశిల్పములోని తత్త్వమెఱిఁగె;

మాటలకుఁ జేతలకు మాఱుపాటులేమి
వఱులె నీయందు రేబాలవంశచంద్ర
యనుచు నెల్లరుఁ బొగడంగ నలరినావు
రమ్యగుణమూర్తి శ్రీ సుబ్బరామిరెడ్డి!

కృత్తికిఁ గావ్యకళా సం
పత్తికి మొగదారులైన మనతొంటి నృపుల్
ఇత్తఱి నరుదేయైనను
బొత్తిగ విడిపోవు మనలఁ బూర్వాభిరుచుల్.