పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

కవికోకిల గ్రంథావళి

[నక్షత్ర

ఈకావ్యములను నేను విమర్శింపఁబూనుకొనలేదు. కవియే తాను రచియించిన కావ్యములను, విమర్శకుఁడగ నవతారమెత్తి పరిశీలించుట యసంభవము. స్వాభిమానము వలన ననవసర ప్రశంస గావించుకొనుటయో లేక విషయము వలన ఉచిత ప్రశంస చేయకుండుటయో సహజముగఁ దటస్థించును. కావున నీ కావ్యములయొక్క గుణాగుణవిమర్శనము రనైక పక్షపాతులైన సహృదయులకు వదలుచున్నాను.

కవులయెడ సమకాలికులకు నిరాదరణము అన్ని కాలములందును ఉండినట్లు తోఁచుచున్నాది. ఈర్ష్యయుఁ దనపెరటిచెట్టు మందు గారు" నెడు సామాన్యజనుల మనస్తత్త్వమును, బరిచయమువలనఁ గలుగు నౌదాసీన్యమును ఇందుకుఁ గారణములుగ నుండవచ్చును. "సమకాలము వారలు మెచ్చరే గదా" యని చేమకూర వెంకన్నవ్రాసిన యీ చిన్న వాక్యమునందు ఆతని హృదయ వేదన యంతయు నిమిడి యున్నది. సమకాలికులచే నిరాదరింపఁ బడిన మహాకవి భవభూతియొక్క వేడినిట్టూర్పులు

యేనామ కేచిదిహ నః ప్రధయం త్యవజ్ఞాం
జానంతి తే కిమపి తాన్ప్రతినైషయత్నః
ఉత్పత్స్యతే౽.స్తి మమకో౽పి సమానధర్మా
కాలోహ్యయం నిరవధి, ద్విపులాచపృధ్వీ.

అను నీశ్లోకమునందు నేఁటికిని ఆవిళ్ళువాఱుచున్నవి. తాను రచియించిన "ఇస బెల్లా" యను కావ్యము పైదాడి వెడలిన యీర్ష్యాపూరిత విమర్శనము వలన భగ్నచిత్తుఁడై కీట్సు అను నాంగ్లేయకవి స్నేహితుఁడైన షేల్లీకి "నేను మరణించిన యనంతరము గొప్పకవి సయ్యెదను కాఁబోలు” అనివ్రాసిన లేఖను జదివిన కిరాతుని హృదయమునందైనఁ గరుణ మొలుకును . ఇట్టి నిరుత్సాహక సందర్భములందు “ 0! I sing for the mere