పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాల]

ఉపోద్ఘాతము

7


శల్యపంజరమును మాత్రము చూడఁగల్గును. కాని యందలి యానందమును సౌందర్యమును ననుభవింపలేఁడు. కవిత్వమందలి ప్రతిపదముచుట్టును నిఘంటువు నిర్ణయమున కతీతమైన భావరోచి యావరించియుండును.

పద్యములు భావప్రేరకములు. భావములు ప్రతిబింబించుటయు, నిరవియగుటయుఁ. బాఠకుని హృదయసంస్కారము ననుసరించి పరిపరివిధములుగ నుండును. కావుననే పాఠకులుగూడ కవులవలెనే రసార్ద్ర హృదయులుగా నుండవలయుననుట. తామరపాకుపైఁ జెరలాడు మంచుబొట్టు ప్రొద్దుపొడుపు మొదలు పొద్దెక్కు కొలది. కిరణవర్ణభేదముల ననుసరించి బహువర్ణములు దాల్చునట్లు పాఠకుల సంస్కారభేదముల ననుసరించి కవితయు వివిధాకృతులతోఁ బొడకట్టు చుండును. ఇందుకీక్రింది దృష్టాంతము గనుఁడు. సూర్యుఁడస్తమించెను. సంజకెంజాయలు జలద శకలములపై నలమికొని పశ్చిమదిశను నొక' చిత్రప్రదర్శన శాలగ మార్చివైచెను. వరిచేలు పండి యొరగి చల్లగాలికి సముద్రతరంగములవలె నల్ల నల్లన నాడుచుండెను. ఇట్టి దృశ్యమును నొక చిత్రకారుఁడును మఱియొక పల్లెటూరి కాపును సందర్శించు చుండిరనుకొందము. చిత్రకారుని చిత్తము ఊహాతీతమైన యా వర్ణసమ్మేళనము యొక్క సౌందర్యమున నిమగ్నమయి పోయియుండును. కాఁపువాని హృదయము బంగారు టిసుకవలె పండి యొరగియున్న వరిచేనుగాంచి నంత ఉవ్విళ్ళూరు చుండును. అతని మనము నాకర్షించుటకుఁ బడమటిదెస యందేమియును వింత తోఁచలేదు. దృశ్య మొక్కటియే యైనను, హరి హృదయఫలకములందు భిన్నముగఁ బ్రతిఫలించెను,

పూర్వులలోఁ గొందఱు కవిత్వమును శాస్త్రముగఁ బరిగణించిరి. ఇది చాల గొప్ప పొరపాటు. శాస్త్రమున నానందములేదు; నగ్న సత్యము కలదు. శాస్త్రకారునికిని శిల్పికిని జాల వ్యత్యాసము గలదు. వారి మార్గములు ధ్రువములవలెఁ బరస్పర భిన్నములనిన సత్యబాహ్యముగాదు, కవియును