పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

6

కవికోకిల గ్రంథావళి

[నక్షత్ర

శంపాలతాంగిని అమృతాంశుముఖిని ఇంతవఱకు సృజింపలేదు. కాని శిల్పియుఁ గవియుస్పజించిరి. ప్రకృతిలోపమును బూరించుటయే కళయొక్క ముఖ్యప్రయోజనము, వివిధ వస్తు సంయోగము నందుఁ బ్రకృతికన్నాను గవులు ముందంజ వేసియున్నారు. చలువగల వెన్నెలల చెలువునకు సౌరభము గలిగినటు Melody of flowers మున్నగుకల్పన లిందునకుఁ దార్కాణములు. కావ్యము ఆనందమయము. కావుననే యానంద దాయకము. కావ్య ప్రయోజనములలో సద్యః వర నిర్వృతయే అను లాక్షణిక నిర్వచనము ప్రధానమైనది.

నిజమైన కవిత్వము ఆకృతిబద్దము గాదు. ఏయాకృతయుఁ గవితారస ప్రవాహమును బట్టియించ లేదు. మూర్తీభవింపని కవిత్వమే ఆప్పటమైన కవిత్వము. ఈ కవిత్వము ఏకాంతమునందు రసార్ద్రమైన మానవహృదయ ముచే ననుభవింపఁబడుచున్నది. ప్రశాంతమను అక్షరములతో వ్రాయఁబడిన యీ కవిత్వమందుఁ జెవికి వినఁబడని గానమున్నది. ఈ గానమనోహరత్వమును మార్దవమును గర్ణేంద్రియ సహాయము లేక హృదయమే స్వయముగ వనుభవించుచున్నది. కావుననే నొగూచి యను జపానుదేశపుఁ బ్రఖ్యాతకవి వ్రాయఁబడిన కవిత్వమున కన్నను వ్రాయఁబడిన కవిత్వమే మధురమై దని నుడివియున్నాడు. కీట్సు అను ఆంగ్లేయ కవియు, Heard melodies are sweet, but those unheard are sweeter అని వ్రాసియున్నాఁడు. కవి యనుభవించు ఆనందము అతని భావవీథినిఁ బొడకట్టుదృశ్యము, స్థూలమైన భాషయందు గర్భికరింపఁపడినపుడు ఆత్మ సౌందర్యమును సగము కోలుపోవును. ఎందు వలన ననఁగా భావములు సున్నితములైనవి; భాష స్థూలమైనది. కావునఁ గవిత్వమునందు అంతర్భూతమైన భాషకొంతయు బహిర్భూతమైన భాష కొంతయు సమ్మిళితమై యుండును. కవిత్వమును నిఘంటు మూలమునఁ దెలిసికొసఁ గోరు నతఁడు రసహీనమైన