పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/263

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

II


బుక్కులసుతీసి యెండఁబెట్టితినిగాని, కాగితములు అట్టలు కట్టుకొని పోయి సిరాతో నలికివేసినట్లు అక్షరములు అగోచరములైనవి. వస్తువు నశించిన వెనుక దానిపై ప్రీతిహెచ్చుట నైజమేమొ! భగ్నావశిష్టములైన యీకావ్యములను ఖండకావ్యములను గుర్తింపసాధ్యమైనంతవఱకు ఎత్తివ్రాసి “ప్రధమకవిత్వ" మనుపేర ఈఖండకావ్య సంపుటమున చేర్చితిని. “స్వప్నాశ్లేషము” మాత్రము బొత్తిగా చీకిపోయినది.

“నలజారమ్మ"కు ననంతరమును "వనకుమారి'కి పూర్వమును అనగా 1917వ సంవత్సరమున వ్రాయఁబడిన “మాతృ శతకము” ప్రతికూడ తడిసిపోయికొన్ని పద్యములు గుర్తించుటకు వీలులేక అర్ధానర్థరూపములతో బయటపడినది. దానిని కూడ నిందుచేర్చితిని. ఈశతకము కావ్యసంపుటమున నలజారమ్మ వనకుమారీకావ్యముల మధ్యగాని లేక ఖండకావ్య సంపుటమున మొదటగాని చేర్పఁబడియుండిన రచనాకాల క్రమమునకు భంగమువాటిల్లకుండెడిది.

ప్రధమకవిత్వముమీఁది ప్రేమచాపల్యముచేత ఈకావ్యఖండములను ప్రకటించుచున్నాను. నాకవిత్వ పరిణామమును దెలిసికొనుట కీకావ్యములుకొంత తోడ్పడగలవు. సహృదయులు నాచాపల్యమును మన్నింతురుగాక..

పెమ్మారెడ్డి పాళెము
9 - 5 - 1935

ఇట్లు,

దుప్వూరి రామిరెడ్డి.