పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విన్నపము.

1915 వ సంవత్సరాంతమున నాయందు కవిత్వ మంకురించినది. 1916 మొదలు 1917 వఱకు నాకవితాభ్యాస కాలము. ఈయొక సువత్సరములోపల వ్రాయుటయు చదువుటయు చాలతీవ్రముగ కొనసాగినది. రసికజనానందము, స్వప్నాశ్లేషము, అహల్యానురాగము, కృష్ణుని రాయబారము, అను ప్రబంధములను రచించితిని. ఋతుసంహారమును పుష్పబాణవిలాసమును ఆంధ్రీకరించితిని. అప్పు డప్పుడు ఖండకావ్యములుగూడ వ్రాయుచుంటిని, ఇవియన్నియుంగలసి వేయి పద్యములకంటె నెక్కుడుగనుండును. కాని, ఆకావ్యములు, వ్రాతనెరపడి కుదురుటకు వాయఁబడు కాపీపుస్తకములవలె నున్నవనియు ప్రకటనార్హములుకావనియు భావించి మూటకట్టి మూలపెట్టితిని.ఎవరైనను “పద్యములు బాగుగానేయున్నవి" అని చెప్పినప్పుడు వారు మోమోటతో చెప్పుచున్నారని భావించితిని. “బలవదపిశిక్షి తానామాత్మన్యప్రత్యయంచేతః” అను అనుభవపూర్వకమైన కాళిదాసుని సూక్తియుండగా నా బోఁటి యశిక్షితునకు ఆత్మవిశ్వాసము కొఱవడుట యొక వింతగాదు.

1927 నవంబరునెలలో వీచిన పెనుతుఫానుగాలికి కిటికీ తలుపులుపగిలి పక్కననున్న పుస్తకములబీరువా వాన జల్లున తడిసి లోనికి నీరు ప్రవేశించి పుస్తకములు నానిపోయినవి. వ్రాతప్రతుల దస్త్రముకూడ నానిపోయెను. ఆనోటు