పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/215

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

192

కవికోకిల గ్రంథావళి

[నైవే

చాలకాలమయ్యె సఖియ, నీ కెంగేల
నాసవంబుఁ బెదవులానఁ బెట్టి,
పానపాత్రమందు భవవిషాదంబును
ముంచి కొంతసేపు ముక్తిగందు.

15-10-1924