పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/214

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ద్యము]

కవిసంశయావస్థ

191

కవి

నిలునిలు మోసఖీ, మనసు నీఱయిపోయె; నవజ్ఞగాదు; నీ
వలె నను జేరవచ్చె బహువర్ణ సుశోభిత చిత్రలేఖ; నే
వలదనఁ జాలనైతి; నెలప్రాయము మోసముఁ జేసె; నిక్కముం
దెలసిన నీవునుం జెలినిఁ దియ్యనికౌఁగిటఁ జేర్తు వింతకున్.

దేని నకార్యమందుఁ గడుదీనత వాకొనుచుంటివో యదే
చానరొ, సంతసంబునకు సాధనమౌను; సపత్నియంచు లోఁ
బూనకు మచ్చరంబు; నదెపో నిను గొల్చెడి తోడఁబుట్టు; వా
మానిని సాహచర్యమున మంజుల వౌదువు నీవు నింకనున్.

ఇద్దఱును నీటికాలువ యొద్ద నిలిచి
మొగముపోలిక లెల్లను బోల్చుకొండు;
అక్కసెల్లియ లొకటైన యపుడు నన్ను
నొక్కకంటైనఁ గనిపెట్టి యుందురు గద!

అతివ, పొరపాట్ల ప్రహసనం బాడినాము,
భరతవాక్యంబుగాఁ బెట్టు వలపుముద్దు;
మిమ్ము నిరువురిఁ గూడి సుఖమ్ముగాఁగఁ
గడచు జీవితశేషమ్ము కల విధాన.