పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

కవికోకిల గ్రంథావళి

[నైవే

కవిత

ఓయీ పచ్చపొలాల కాఁప, యిఁక నీయుల్లంబె శోధింపుమా,
హేయంబౌ యపరాధకల్మషము నాకే గట్టయత్నింతు వో
హో! యీనైపుణీచాలుఁ జాలు! నట నీయుత్సంగ సౌఖ్యంబునెం
తో యాసించెడి చిత్రలేఖ విడి నాతోడేల నీకిప్పుడున్?

నేఁటికైనను నాయున్కి నీకుఁ దలఁపు
వచ్చె, నది కొంతభాగ్యంబు మెచ్చుకాఁడ,
బహుళ సంతానవతియైన భార్యవలపు
సాటిగాదయ్యెఁ గ్రొం దగులాటమునకు!

ప్రేమసూత్రాలఁ ద్రెంపెడి బిగివి సడలి,
బిచ్చకత్తియపోల్కి నీ పిలుపులేక
వచ్చి నిలిచితి ముంగిట, నిచ్చకాల
కైనఁ దలయెత్తిచూడవు; మౌని వైతె?

చిత్రలేఖకు నీ కెడసేయలేక
యర్హశిక్షను గొంటి స్వయంకృతాప
రాధమున, కింక నాగుండె ఱాయిఁజేసి
వెడలిపోయెదఁ, గడపటి వీడుకోలు!