పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/210

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ద్యము]

వానాకాలపు పల్లీజీవితము

187


కలకల నవ్వుచుం గలుపు గంటలు దీయుచుఁ బాట పాడుచుం
బొలములఁ జుక్క గుంపటులఁ బోడిమిఁ జూపెడి పల్లెటూరితొ
య్యలుల నిసర్గ రమ్య దరహాస విలోకన చేష్టలందు ని
ష్కలుషపు గ్రామ్యజీవనపుఁగమ్మఁదనంబు బలే! గుబుల్‌కొనున్

ఎన్నియిక్కటులుండిన, నేమియైనఁ,
గుడువఁ గట్టను నొకవేళఁ గొదవయైనఁ
బ్రకృతి సామీప్య జీవన భాగ్యమొకటె
యున్న కడగండ్ల మఱపించు నూఱడింపు.

అక్టోబరు 1924__________