పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/207

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

184

కవికోకిల గ్రంథావళి

[నైవే

నిలువ నీడైనను నీకు లేదమ్మ!
కల్పసుమంబవై గంగాతరంగ
శీతల శీకరాసేచనం బొంది
చల్లగా బ్రతుకు నీ సౌఖ్యంబుమాన్పి 120
ఏ పాడుగాలి నిన్నీ వల్లకాటి
దుమ్ములోఁ బడవైచె? తుద కెండవాడి
ధారుణి గర్భగంధంబు సొంపెక్క
నీదు నెత్తావులు నింపుచున్నా వె!
నీ రమ్యలాస్యంబు, నీ సోయగంబు
గాంచ మర్త్యులకు యోగ్యతయుండఁ బోదు;
నక్షత్రమండల నాట్యరంగములఁ
జంచలా లతికల సాహచర్యమునఁ
గాన్పించుమా నీ యగణ్య నర్తనము!
పన్నీరు పూఁబొదల్ ప్రక్కల బలిసి 130
నీ గోరిపైఁ జల్లు నిత్యమ్ముఁబూలు;
కవులు కన్నీటిబిందువుల నీ గోరిఁ
దరతరంబులనుండి తడుపు చున్నారు.
ఎందఱెందఱొ పాంథు లెన్నెన్నిమార్లొ
నిట్టూర్పు సెగల నిండిన పూలుచల్లి
గౌరవించిరి నీదు గోరీని సరియ!