పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ద్యము]

అనార్కాలి

183

అని యూరడించుచు నా యనార్కాలి
విడరాని కౌఁగిలి విడిపించులోన,
‘రమ్ము, తడయంబోకు, రాజాజ్ఞ యయ్యె'
నను చొక్కభటుఁడు ప్రేయసి వెంటనడిచె; 100
యువరాజు హృదయంబు, యువతి దేహంబు
నొక్క-గోరీయందే యునికి గైకొనియె.

        ఏమి యీగారడి! ఏమి యీమాయ!
ఏమి సుఖస్వప్న! మేమి మేల్కొలుపు!
పెదవి పాత్రలమధ్య విశ్వ విప్లవము
జరుగు నవకాశంబు! సంసారమింక
గఱికయుం బట్టని కాటిచౌడేన?
సన్న్యాసి, నీకొక్క క్షణము జయంబు!

         ఓయి యగ్బరుషాహి, ఓకఠోరాత్మ,
ప్రణయంబునకుఁ జావె ప్రతిఫలంబేని. 110
అవనియెల్ల శ్మశానమట్లు మార్పడదె?
నీతికిఁ జిహ్నంబు నిర్దయత్వంబె?
మానవ తత్వంబు మఱచిపోయితివొ?

        ఓ యనార్కాలి, మాయుల్లంబునందు
నీకాలి గుర్తుల రేక లగపట్టు
ఈర్ష్యామయంబైన యీలోకమందు