పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

182

కవికోకిల గ్రంథావళి

[నైవే

పైని మోహం బేడ? బానిస వైతె?
ఎవరురా లష్కరు? లీ యనార్కా లిఁ
గొంపోయి యిప్పుడే గోరిపెట్టుండు'
అని యాజ్ఞ పెట్టి రాజరిగె లోపలికి. 80
విగత చైతన్యుఁడై వెలవెలవాఱి,
యొక్క క్షణంబులో యుగములు గడిపి,
రాజాజ్ఞ త్రిప్పనేరక వ్రేలుకఱచి
శోక దావాగ్నిచే శోషిల్లి, మాట
లాడఁ జాలని యా జహాంగీరుఁ గాంచి:
'ఓ జీవితేశ్వరా, యుమ్మలంబేల?
నాప్రాణ మూల్యంబునం గొంటి నీదు
ప్రణయ బంధంబగు బాహు బంధనము;
అద్దాని నామెడయందుఁ గీలింపు'
మనఁగ, జహాంగీరు ఆముద్దులాడిఁ 90
గౌఁగిటిలోఁ జేర్చి కన్నీరు దుడిచి,
నును గులాబీపూల కెనయౌ కపోల
ములు వేఁడియూర్పుల వెలవెలవాఱఁ
గడసారి ముద్దిడి కన్నీరు నించె,
'ఇంకఁ జావైన నా కిష్టమౌఁ బ్రియుఁడ,
సెలవిమ్ము స్వర్గానఁ గలిసికోవచ్చు.'