పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/203

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

180

కవికోకిల గ్రంథావళి

[నైవే


      ఓ యనార్కాలి, రాగోజ్జ్వలపాద
పల్లవంబుల నేల మెల్లగా నిడుము,
మాచిత్త చంపకమాల లచ్చోట
స్పర్శ సుఖాపేక్షఁ బడియున్న వవిగో! 40
ఈ విలాసంబున కింకేది హద్దు?
ఈ నాట్య లహరికి నేది కూలంబు?
ఈ రసోన్మత్తత కేది యంతంబు?
ఈ రాగవీచుల కేది మూర్చనము?
మగరూపు దిద్దిన మగఱాతికైనఁ
బ్రేమ రసంబులు పిచ్చిల్లె నన్న
సకల భోగంబులు చవిగొన్న రసికుఁ
డా జహాంగీరుని యాత్మ యింకెట్లు
పరవశంబాయెనో భావింపఁ దరమె?
ఆ యనార్కాలి మోహన మూర్తిఁగాంచి, 50
ఆ కన్య యంగవిన్యాసంబుఁ జూచి,
పాప! మా యువరాజు వ్యంగ్యగర్భముగ
దరహాస మొనరించె; దానికి మాఱు
సేఁతగా ముద్దియ చిఱునవ్వు నవ్వె;
ఆ నవ్వు దర్పణంబందు బింబించి
ప్రక్కన నేఁగు నగ్బరు కంటఁబడియె.