పుట:Kavijeevithamulu.pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
74
కవి జీవితములుబడవేయఁబడె నని వినినతోడనే దానిని మరల వ్రాయింపకపోఁడు. కావున నిది యా కాలములో రూపుచెడఁబోయె ననియును, అనంతరకాలములో ననఁగా నైదాఱువందలసంవత్సరము లైనపిమ్మటను కారణము లేకయే ఒక్కరికిమాత్రము తెలుపఁబడియెనని చెప్పుట సహేతుకముకాదు.

భీమకవికాలము మొదలుకొని అప్పకవికాలమువఱకును మధ్యను అయిదువందలసంవత్సరములు వ్యవధి యున్నది. ఈకాలములో ననఁగా పై అయిదువందలసంవత్సరములకాలములో నీ నన్న యభ ట్టీయవ్యాకరణము కాన్పించకుండుటకుఁ గారణము విచారించి చూడఁగా నిది భీమకవి వలనఁ బూర్వపక్షము చేయఁబడెననియు, నట్టికారణమున నది అప్పటివా రందఱివలన నుపేక్షింపఁబడె ననియును దోఁచుచున్నది. కాని యామధ్య కాలములో నాధర్వణవ్యాకరణమే ఆంధ్రభాషకుఁ బఠనీయగ్రంథముగా నప్పటివారివలన గ్రహియింపఁబడినట్లుగా నూహింపఁబడవలయును. ఇట్టి వృత్తాంతము చెప్పుట కిష్టము లేక అప్పకవి పూర్వపక్ష గ్రంథ మగునన్న యభట్టీయమును బునరుజ్జీవింపఁజేయునిష్టముచే నిట్టియపూర్వవృత్తాంతము నొకదానిని వన్నె ననియు, నదియు నొకరివలన వింటి నన నది యతనిసమకాలీనుల కైన నమ్మకముగా నుండ దనుతలంపున నట్లు చెప్పె ననియుఁ దోఁచెడిని. నన్న యభట్టుచేఁ బూర్వపక్షము చేయఁబడినరాఘవపాండవీయ మెట్లుగ నామరూపరహితముగనయ్యెనో అటులనే భీమకవిచేతను బూర్వపక్షముచేయంబడిననన్న యభట్టీయము నామ రూపరహితమై పోయె నని యొప్పుట కాక్షేపణము లేదు. భీమకవికిని అప్పకవికిని మధ్య కాలములో నున్న వారికవిత్వము లధర్వణవ్యాకరణ మతానుసార లనుట కనేకదృష్టాంతము లున్నవి. అట్లున్నను అప్పకవి యీగాథను బన్నుటకుఁ గారణము పూర్వపక్షిత గ్రంథోజ్జీవనార్థమే కాని మఱియొకటి కా దని స్పష్టమైనది. దీనిచే భీమకవిపై నప్పకవి చేసిననిందాప్రయోగములును నిష్కారణద్వేషబుద్ధి చూపుటయును స్థిరపడుచున్నవి.


Kavijeevithamulu.pdf