పుట:Kavijeevithamulu.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
73
నన్నయభట్టు.యణము మొదలగుప్రాచీనగ్రంథములును నన్న యభట్టీయమతానుసారము లై యుండె నని అప్పకవి అభిప్రాయమేమో? అట్లనినచో నప్పకవికి నెవరికంటె నెవరు ప్రాచీనులో ఆసంగతి తెలియనే లేదని చెప్పవలసియుండును.

నన్న యభట్టీయమును దెనిఁగింప దొరఁకొనుచున్నాఁడు కావున నప్పకవి కాగ్రంథ మంతఘనముగాఁ గాన్పించుచున్నది. కాని నన్న యభట్టుకాలములో నీగ్రంథమున కంత కాకున్నఁ గొంతయైన గౌరవ మున్నట్లు కాన్పించదు. నన్న యభట్టీయముకంటె నధిక మగునాధర్వణాచార్యుని వ్యాకరణమే ఆకాలములో విశేషవిఖ్యాతితో నుండెను. ఆంధ్రభాషలో నపశబ్దోచ్చారణానంతర మాధర్వణనామస్మరణ చేసినచోఁ దద్దోష పరిహారమగు నని యుండుటంబట్టి నన్న యభట్టు వై యాకరణుఁడుగానే యెవ్వరివలనను గ్రహింపంబడలేదు. ఇ ట్లున్నను సర్వకాలములలోను నన్న యభట్టీయమే పూజనీయమై అది తిక్కన మొదలగు మహాకవులప్రయోగములకుఁగూడ నాధారగ్రంథ మై యున్న దని అప్పకవి చెప్పినందులకుమాత్రము విచార మగుచున్నది.

సారంగధరుఁడు వ్యాకరణమును బ్రకటించుట.

రాజనరేంద్రునిపుత్రుఁ డగుసారంగధరుఁడు నన్న యభట్టీయవ్యాకరణము రచియింపఁబడునపుడు దానిం బఠియించె ననియు దాని నితరు లెవ్వరును నెఱుంగ రనియు నప్పకవిమతము. ఇది మఱియుఁ జిత్రముగా నున్నది. నన్నయభట్టు వ్యాకరణమును లోకోపకారార్థము రచియించును గాని యొక్కసారంగధరునికొఱకే అయి యుండదు. గ్రంథము వ్యాపకమే అయినచో మఱికొందఱు గూడ దానిఁ దెలిసికొనక మానరు. ఇదియునుంగాక నారాయణధీరుఁడు సహాయము చేయఁగా నన్నయభట్టీయము రచియింపఁబడిన దని అప్పకవియే చెప్పియున్నాఁడు. హ్రంథము నష్టమైపోవునపుడు నారాయణభ ట్టయినను దానిని వ్యాపింపఁ జేయకపోఁడు. సారంగధరుఁ డైనను నీగ్రంథము భీమనచే గోదావరిం