పుట:Kavijeevithamulu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టు.

69

రము గావున నీకవు లిరువురును ఆసిద్ధాంతము చూచువఱకును సమకాలీను లని యంగీకరింతము. నన్నయభట్టు వార్ధి కావస్థలో నుండవచ్చును. తిక్కన బాలుఁడై యుండవచ్చును. వారిరువురకును వయస్సులో నేఁబదియఱువదివత్సరములవఱకును భేద ముండవచ్చును.

నన్నయభట్టారకునిగద్యము.

"ఇది సకలసుకవిజనవిమతనన్న యభట్టప్రణీతం బైనశ్రీమహాభారతంబునందు" అని యున్నది. దీనింబట్టి యితనివంశస్థులవలన సంపాదింపఁబడిన గౌరవములు గాని తండ్రిపేరుగాని కానుపించదు. దీనిం జెప్పఁజాలుగ్రంథములును గానరావు. కావున నాయంశ మట్లే యుంచుదము.

ఆంధ్రశబ్దచింతామణివిషయము.

ఇది నన్న యభట్టారకునిచే రచియింపఁబడినట్లు చెప్పఁబడినవ్యాకరణము. సూత్రము సంస్కృతము నుదాహరణములు తెలుఁగున నీయంబడినవి. ఈగ్రంథముంగూర్చినసంగతి భారతగ్రంథములో నున్న నన్నయభట్టువలఁన దా నావఱకుఁ జేసియుండిన గ్రంథములోఁ జెప్పఁబడదాయెను. ఈగ్రంథములో నావృత్తాంత మేమియుఁ దెలియ వీలులేదు. దీనింగూర్చి కాకునూరి అప్పకవిచే నతనివలన రచియింపఁబడినయప్పకవీయ మనుగ్రంథములోఁ గొన్ని యంశములు వ్రాయఁబడినవి. అంత కంటె మన కిప్పుడు పైయాంధ్రశబ్దచింతామణిం జెప్పు గ్రంథములు లేవు. కావున నందు వ్రాయఁబడిన దంతయు నిట వివరించెదము. ఎట్లన్నను :- అప్పకవీయము మొదటియాశ్వాసములో శా. శ. 1578 సరియైన మన్మథసంవత్సరదక్షిణాయనమున శ్రావణబహుళ 8 శ్రీకృష్ణజయంతినాఁడు శ్రీకృష్ణమూర్తి స్వప్నంబునఁ గాన్పించి :-

ఉ. ఈ యువతుల్ రమాధరణు లేను బయోరుహపత్త్రనేత్రుఁడన్
    నీయెడఁ గూర్మి గల్గి ధరణీదివిజో త్తమ వచ్చినాఁడ స్వ
    శ్రేయస మబ్బు నీకు నిఁక సిద్ధము నన్నయఫక్కి యాంధ్రముం
    జేయుము మాయనుగ్రహముచేఁ గవు లచ్చెరు వంది మెచ్చఁగన్.