పుట:Kavijeevithamulu.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టు.

63కొందఱు చెప్పికొనెదరు. అది నమ్మ నర్హము కాని దైనను అచ్చటచ్చట లోకంబున వాడంబడుటంబట్టి దాని నిట వివరించెదము. రాజనరేంద్రుండు భారతంబు పూర్ణంబు చేయుటకుఁ దగు పండితుఁడు తిక్కన యని నిశ్చయించి యతనిప్రభుం డగుమనుమసిద్ధి రాజుకడ కాపండితుని బంపుటకుఁ గోరి వర్తమానంబు పంచెను. ఆమనుమసిద్ధి అట్లనే చేసెదనని తిక్కనను రావించి రాజనరేంద్రునికడకుం బొమ్మనుడు దానికిఁ దిక్కన సమ్మతింపనందున మనుమసిద్ధి కోపించి నీవు నాయాజ్ఞానుసారముగాఁ బోకుంటివేని నీమూతి గొరొగించి తప్పెటలతో వీధులవెంబడి నూరేఁగించి యూరివెలపట గుడిసెలో ప్రవేశ పెట్టి నీనోటకండక జరిపించెద నని చెప్పి భయ పెట్టెను. దానికి దిక్కన జంకక యుండినచో మనుమసిద్ధి యాతనిం బ్రార్థించి రాజమహేంద్రవరంబు బంచి తన్ను నదివఱకుఁ బల్కినపల్కులు వృథ గాకుండఁ దిక్కనచే యజ్ఞదీక్ష చేయించినఁ దిక్కనకు మూతి గొరిగించుకొనుటయుఁ దప్పెటలతో నూరేగించుటయును, గుడిసెలోఁ బ్రవేశించుటయును, మాంసభక్షణంబును తటస్థము లయ్యెనఁట !

ఈకథ పండితసామాన్యముగా వాడుకొనంబడక యుంటచే నీవఱ కిందుఁ బొందుపఱుపఁబడ దయ్యె. ఇపు డిది రాజనరేంద్రునితో మనుమసిద్ధి సమకాలీనుఁ డనువృత్తాంతమును రూఢపఱుచుట కిందు ముఖ్యముగా నుద్ ఘోషింపఁబడినది. అట్టిసిద్ధాంతమునకుం గల కారణంబులు నీకథాంతంబున విమర్శమూలముగా వివరింపనై యున్నాము గనుక నిపుడు తరువాతివృత్తాంతంబు వ్రాయుదము.

కుమ్మర గురునాథుం దోడ్తెచ్చుట.

"నేను గననంబు నుడువుచో నన్వయించుచు వైళంబ వ్రాయఁ గలయొకపండితుఁడు వలయును. మీకడ నుండువారిలో నొక్కనిఁ బంపుఁడు" అనినఁ దిక్కనం గాంచి రాజు మీధాటికిం దగువాని మీరే నుడువవలయును. అట్టివాని మే మెచ్చో నున్నను మీయాజ్ఞఁ దెలిపి తోడి