పుట:Kavijeevithamulu.pdf/721

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామగిరి సింగనకవి.

713

"వ. ఇట్టివేదాంతసార సర్వస్వం బై యాదిమకవిసార్వభౌముం డగువాల్మీకి మహర్షి ప్రవరవదన సదనామృత ద్రవమృదూకృత మధుమాధురీరసఝరీ విరాజితపరగణ బద్ధం బై పురాకృతభాగధేయమాత్రసంవేదక మహార్థగుంభితం బై, సకృత్కర్ణకోటర ప్రవేశమాత్రాపకర్షి తచిత్తగతమహామోహదుర్వాసనామలశబ్దరాజీవిరాజితంబై సకృత్పఠనమాత్రాపనోదిత బహుజన్మానుస్యూతశోకసంచయం బగుశ్లోకసంచయసముద్దీ స్తంబై అజ్ఞసర్వజ్ఞచిత్తరంజక కథావిసరప్రశస్తంబై యుపమేయగతపరతత్త్వస్వరూప సర్వస్వప్రకాశకార్థచమత్కారగర్భితోపమానచయభరితం బై యశేషవర్ణనీయమహా మహిమంబై యొప్పారునీసర్వోత్కృష్టతరమోక్షశాస్త్రంబును తన్మహర్షి శేఖరుకృపాబలం బొక్కటి దక్క నితరంబు లగుకావ్యబంధకౌశలాదు లెఱుంగనినేను జవనుండగు జాంఘికుండు స్వేచ్ఛావిహారంబు సల్పినతెరంగున, ఖర్వుండు తత్పదస్థానంబులం బ్రలపనంబులిడుచుఁ బ్రాసరూపకంటకంబుల యెడం గంటగింపక, యుభయసంధులన్ మార్గంబుదప్పక, ప్రాప్తంబగు విచ్ఛిత్తినెడయక, సద్గణపద్ధతి నతిక్రమింపక నడువనుద్యోగించుచందంబునఁ దెనిఁగింప సమకట్టినమదీయజాల్మతను సహించి జంతువులకు సర్వ గుణంబుల సహజంబు లైన యీకృతింగల మద్బుర్ధిజాడ్యజనితదోషములచే నసూయతా మాత్ర చిత్తులుగాక, యిచట సాధకార్థగ్రహణ మాత్రంబే ప్రయోజనంబు గా నెఱింగి యార్యభావంబు నొంది సర్వులు విని యానందభరితాంతరంగులు కావలయు నని ప్రార్థించి, యనంతరంబునం బ్రారీప్సిత గ్రంథంబునకు నవిఘ్న పరిసమాప్తి నిమిత్తంబుగా శిష్టాచార పరిప్రాప్తేష్టదేవతాప్రణామలక్షణం బగుమంగళంబును, గ్రంథకారుం డగు నప్ప్రాచేతనుం డంగీకరించి చెప్పినశ్లోకంబుమొదలుకొని గద్యపద్యాత్మకంబు గాఁ జెప్ప నారంభించితిని."

అని యున్నది. కాని యిట్టి పై యుపన్యాసానుసారముగాఁబ్రత్యేకము కవిత్వము దోషయుక్తముగాక సామాన్యముగా గ్రంథము రమ్యముగానే యున్నది. ఈగ్రంథము యథామూలముగాఁ దెనిఁగించుటం జేసి సింగకవికృతగ్రంథమునకంటె రెండుమూఁడురెట్లు పెరిగినది సింగకవి కృత మగుగ్రంథము నూటముప్పదిపుటలు గలదియు నీనవీనకవి ప్రణీతము నాల్గువందలముప్పదిపుటలగ్రంథము గలదియు నైనది. గ్రంథ బాహుళ్యమున సారాంశము సుబోధము కాదనియే పూర్వకవులలోఁ బెక్కండ్రు గ్రంథములఁ దెనిఁగించునపుడు సాధ్యమగునంత సంగ్రహములుగానే తెనిఁగించుచు వచ్చిరి. ఆర్షేయగ్రంథములు పురాణములవలె నతివిపులము లై చెప్పినయంశమునే మరల నినమాఱు