పుట:Kavijeevithamulu.pdf/719

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామగిరి సింగనకవి.

711

నన్నయతిక్కనలకృతం బని ఆయిర్వుర నుతియించె. ఈసింగనకవి భాస్కరరామాయణగ్రంథకర్తలలో నొకరిపేరునైన స్మరియింపలేదు సరియేకదా తిక్కనసోమయాజివలనఁ గూడ నుతియించఁబడిన యతని తాత యగుభాస్కరమంత్రినిఁ గూడ వదలివేసెను. ఆకారణమున నాతని కంటె నీసింగనకవి ప్రాచీనుఁ డనిచెప్పనొప్పియుండదుగదా. ఇతర మైనసాధనములచేతనే యెఱ్ఱాప్రెగ్గడకంటెఁ బూర్వుఁ డని తేలునెడల దానికి సహాయముగా నతనిపే రీతఁడు స్మరియింపకపోవుటకుఁ బై కారణము పనికివచ్చును. అటుగాక సింగకవి కాలమంతయు నూహలపైననే స్థాపించుచోఁ దానిలోఁ బడినపొరపాటునకు నీసింగనకవి యెఱ్ఱాప్రెగ్గడపేరు స్మరియింపకపోవుటకూడ సహకారి యని చెప్పుట యొకయుక్తికాదని నాయభిప్రాయము. ఇట్టి సిద్ధాంతమునకు ముందుగాఁ బంతులవారు పద్మపురాణ మార్కండేయపురాణ కృతిపతులకుఁ గలసంబంధము చెప్పి దానిని నిరార్ధాణచేయవలసియున్నది. కావున నదియైనపిమ్మట దాని కుపబలకముగాఁ బనికివచ్చు నీయెఱ్ఱాప్రెగ్గడవృత్తాంతముఁ గూడఁ గైకొందము. ప్రధానాంశము నిలువఁబడనప్పు డేయంశముంగూర్చి వ్రాయపనియే యుండదుగదా. కావున దీని నిప్పటికి వదలెదము.

నవీనవాసిష్ఠ రామాయణవృత్తాంతము.

ఇదివఱలోనే నిట్టిపేరుతో నొప్పుకొనక నవీన గ్రంథము బయలువెడలెనని వాక్రుచ్చియుంటిని. ఆగ్రంథవిషయమై కొంత చెప్పి అనంతరము దానికిని సింగకవికృతగ్రంథమునకు గలభేదముం జూపెదను.

కవివంశావళి.

కృష్ణగిరిలో హరితసగోత్రుఁ డగు

నృసింహము.

|

రామయ్య.

|

వేంకటరమణయ్య. (కవి)