పుట:Kavijeevithamulu.pdf/718

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

710

కవి జీవితములు.

జ్యేష్ఠుఁ డైనట్లు కానుపించును. మంచిగన్నయ యనునతఁడు మల్లన యనునతనిపుత్త్రుఁడై యతనినల్వురికొడుకులలోఁ గనిష్ఠుఁడుగాఁ గాన్పించు. ఇట్లున్నను పంతులవారు గన్న సేనానికి జ్యేష్ఠభ్రాత యున్నాఁ డనియు నతఁడు గణపతినాముఁ డని వ్రాసిన వాక్యముల కర్థముకాకయున్నది. మార్కండేయపురాణములోని గన్న సేనాని యింటిపేరుగాని గోత్రముగాని వివరింపఁబడియుండలేదు. పద్మపురాణములోని మంచిగన్నయ వాణస వంశమువాఁ డనియును కాశ్యపగోత్రుఁ డనియు వ్రాయంబడియున్నది. ఆయిర్వురితండ్రులపేరులును భేదములైనవి. వాటియాద్యక్షరములైన నొకటి కావు. ఒకనిపేరు నాగయ్య. రెండవయతనిపేరు మల్లయ్య. అయితే యీమల్లయతండ్రి యగునన్నయమంత్రి కాకతీయగణపతి కాలీనుఁ డని యుండుటచేతను, నాగయ్య యను నతనిమామ యగుమేచనయను నతఁడు కాకతీయగణపతియొద్ద తలారి యని యుండుటంబట్టి ఆయిర్వురు కాకతీయగణపతికాలీను లనునమ్మకముతో నుండి తక్కినసంగతులన్నియుఁ బొరబాటున నూహించియుందురు. ఇట్లుగానినాఁడు పంతులవారి యూహలకుఁ గలకారణముల వివరింపుఁ డని పంతులవారినే మనము కోరుదము. దానిని వారు తెల్పినపిమ్మట నీకథనంతయును నమ్ముదము. ఇఁకఁ బంతులవారు వివరించిన తక్కినయంశములఁగూర్చి విచారించవలసియున్నది. అందులో నెఱ్ఱాప్రెగ్గడకంటె సింగకవి పూర్వుఁ డని యీక్రింధివిధంబున వ్రాసిరి.

"ఇతఁ డెఱ్ఱాప్రెగ్గడకంటెఁ గొంత పూర్వుఁడు. కాబట్టియే సింగకవి పద్మపురాణమునం దీక్రిందిపద్యముచేత నన్నయ తిక్కనలను మాత్రమే స్తుతించియున్నాఁడు." అని. ఇది కేవలమొక సిద్ధాంతాంశముగాదు. కొందఱుకవులు కవిత్రయము వారినిఁగూడ నుతి యింపక యుండుట గలదు. మఱికొందఱు నన్నయ తిక్కనలమాత్రమే నుతియించుటయుఁ గలదు. తిక్కన సోమయాజియే నన్నయభట్టు భారతములోని మొదటి మూఁడుపర్వములం దెనిఁగించె నని వ్రాసియుండుటం జేసి ఆమార్గమునే అతనిసంబంథి యగుసింగన యవలంబించి భారతము