పుట:Kavijeevithamulu.pdf/715

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామగిరి సింగనకవి.

707

తెలుఁగురాయలంగూర్చి.

ఇదివఱలో జైమినీభారత గ్రంథముంబట్టి సాంపరాయని కాలమును నిర్ణయింపవచ్చునని శ్రీనాథకవి చారిత్రములో వ్రాసియున్నాను. ఆసాంపరాయనివర్ణనకంటె నాగ్రంథములో నాతని యాస్థానసామంతుఁ డును కృతిపతి యగునతనివర్ణనము విశేషించి వ్రాయంబడినది ఆవర్ణనలో నీసాంపరాయనింగూర్చి కొంచెము వ్రాయంబడె నని సూచించి యుంటిని. ఆపద్యమును వివరించెదను. ఎట్లన. -

"సీ. దురములో దక్షిణసురతాను నెదిరించి, కొనివచ్చిసాంపరాయనికి నిచ్చె
      సామ్రాజ్యమున నిల్పి సాంపరాయస్థాప నాచార్యబిరుదు విఖ్యాతి గాంచె
      శ్రీరంగవిభుఁ బ్రతిష్టించి యిర్వదివేలు, మాడలద్దేవునుమ్మళికి నొసఁగె
      మధురాసురత్రాణు మడియించిపరరక్ష, సాళువబిరుదంబు జగతి నెఱపె

తే. గబ్బితనమునఁ దేజి మొగంబు గట్టి, తఱిమి నగరంపుగవనులు విఱుగఁద్రోచి
    తానువ్రేసినగౌరునుద్దవిడిఁ దెచ్చె, సాహసంబున నుప్పొంగుసాళ్వమంగు."

ఇ ట్లుండుటంబట్టి పైసాంపరాయఁ డొకగొప్పరాజుగాఁ దేలు చున్నది. ఇతనికుమారునిపేరు తెలుఁగురాయఁ డని అతనిని సాంపరాయని తెలుంగాధీశుఁ డని శ్రీనాథకవి వర్ణించిన ట్లుండుటచేతఁ దేలినది. ఇతనికే యిర్వురుకుమారు లుండిరనియు నందులోఁ బెద్దవాఁడు కుమారముప్పరాజనియుఁ దేలినది. ప్రస్తుతములోని తెలుఁగురాయఁడు కూనయముప్పభూపాలు నికొడుకుగాఁ దేలుటంజేసి పైసిద్ధాంతము తిరిగిపోయినది.

తొయ్యేటి అనపోతభూపాలునికాలము.

ఈ యనవోతభూపాలునికాలముంగూర్చి యీవఱకే తిక్కన సోమయాజిచారిత్రములో నీసింగకవింగూర్చి వ్రాయునపుడే కొంతవ్రాసియున్నారము. కొండవీటిశాసనములంబట్టి యితనికాలము శా. స. 1220 మొదలు శా. స. 1250 వఱకు నున్నట్లుగా వివరించియుంటిమి. అతనికడ మంత్రిగా నున్నసింగనమంత్రితండ్రి యగునయ్యలమంత్రియుఁ గొంచె మెచ్చుతగ్గుగా నాకాలమువాఁడే అయియుండును. అదియునుఁగాక అనవోత భూపాలుఁడు ముప్పదిసంవత్సరములు రాజ్యము