పుట:Kavijeevithamulu.pdf/713

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామగిరి సింగనకవి.

705

పురిలోని నృసింహస్వామిపేరిటనే నృసింహశతక మనుసీసపద్యశతకము పుట్టినది. దానిముకుటము. -

".........శ్రీధర్మపురనివాస, దుష్టసంహార నరసింహ దురితదూర"

అని యున్నది. కావున నృసింహస్వామియుండిఅందుమూలముగాఁ బ్రసిద్ధినందిన ధర్మపురి పైధర్మపురియే యనియు నా నృసింహునకే యీ కేసనమంత్రి విశేషోత్సవాదులు చేయించుచుండె ననియు దేలినది. ఇఁక రామగిరిపై నీ కేసనమంత్రి గుడికట్టించి అందులో విష్ణుని ప్రతిష్ఠ చేసె నని మఱియొక వృత్తాంతము నాపద్యములోనే యున్నది. ఈరామగిరిసీమలోనే యీసింగనకవి తాను ముప్పభూపాలునివలన ననేకవృత్తులు గ్రామములు సంపాదించినట్లున్నది. ఈ రామగిరి అనునది కేవలము పర్వతమే కాక యొకగ్రామనామముకూడ నైనట్లును, అది యీముప్పభూపాలుని ముఖ్యపట్టణ మైనట్లునుగూడఁ గాన్పించు. దానికి వాసిష్ఠరామాయణములో నీక్రిందివిధ మగునాధార మున్నది. దానిలోనే కృతిపతి యగు కందనమంత్రివృత్తాంతముగూడ వచ్చునుగావున నావాక్యములు ముందు వివరించి కృతిపతివిశేషములఁగూడ నీ రెండుగ్రంథములలో నున్నట్లు వివరించెదను. అది యెట్లున్నదనఁగా :_

"విష్ణువిభవాభిరామంబు లగుపద్మపురాణోత్తరఖండంబును, భాగవత దశమస్కంథంబును దెనుంగున రచియించి యప్పుణ్యపురాణంబులకుఁ గృతిపతిగా నే పుణ్యుం భ్రార్థింతునో యని విచారించి, గజగంథవారణ, గండగోపాల, చలమర్తిగండ, రాయగజకేసరి, దొంతిమన్నె నానావిభవాది బిరుదవిఖ్యాతులం బ్రసిద్ధుం డగు రామగిరిపట్టణాధీశ్వరుం డైనకుమార ముప్పభూపాల మాన్యమంత్రివరధురంధరుండును, అమ్మహారాజ దిగంతరవ్యాపృతకీర్తిలతాలవాలుండును, ధర్మచారిత్రుండును, నీతిచాతుర్య వివేకవిశేష గుణాలంకారుండును, నఖిల దిగ్భరితకీర్తి విశాలుండును, వాణసవంశాబ్ది సుధాకరుండును, గాశ్యపగోత్రపవిత్ర అబ్బనార్యతనూభవ కందనామాత్యుండు నాకు నతిస్నేహ బాంధవుండును, అపూర్వవచనరచనానుబంధబంధుర కావ్యరసాభిజ్ఞుండును, నర్థిజనపారిజాతుండుఁ గావున నమ్మంత్రియుగంధరుం గృతిపతిఁ గావించి"

అని యున్నది. దీనింబట్టి చూడ నీసింగకవికిఁ బ్రభుం డగు ముప్పభూపాలుఁడు రామగిరిపట్టణాధీశ్వరుఁ డని తేలినది. ఈపట్టణము ప్రధాన