పుట:Kavijeevithamulu.pdf/700

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

692

కవి జీవితములు.

దనారాయణ రాజపుత్రుఁ డగుకృష్ణమరాజువలనఁ గరణికమును సంపాదించిన ట్లున్నది. అ దెట్లనఁగా :_

"గీ. పరఁగ వేజెళ్లకృష్ణభూపాలుకరుణ కరణ, మననేర్పు మీఱంగ థరణిఁ బ్రజల
     నరసి పాలించి శుభముల నలవరించి, మించి బంధులఁ జాల పోషించె నెలమి."

ఈకృష్ణమరాజు శా. స. 1558 మొదలు శా. స. 1600 వఱకు నలుబదిరెండుసంవత్సరములు పాలించె. అతనికాలమువారలే తిప్పయ్య జగ్గయ్య యనువారలు. జగ్గయ్యపుత్రుఁ డగునీవేంకటాచలకవి మఱి యేఁబదిసంవత్సరములకాలములో నున్నట్లుగా నూహింపవచ్చును. అటులనైన శా. స. 1558 మొదలు శా. స. 1580 లోపుగా జగ్గన్న యుండె ననియు నతనిపుత్త్రుఁ డగువేంకటాచలకవి శా. స. 1610 గల కాలములో నున్నాఁ డనియుఁ దేలుచున్నది. ఈవేంకటాచలకవి తనకుఁ బైప్రభువులతో సంబంధ మున్నట్లుగా నుడువలేదు. తాను ములుగు గురులింగమూర్తికి శిష్యుడఁ నని అతనికృపవలనఁ దనకష్టాంగయోగనిష్ఠ గలిగె ననుమొదలగు నంశములఁ జెప్పె. కావున నీతనితండ్రి పెద్దతండ్రులను బట్టియే యితని కాలము నిర్ణయింపవలసివచ్చినది. ఇతనివర్ణనపద్యముల వివరించెదను. ఎట్లన్నను :_

"క. ములుగు గురులింగమూర్తికి, పొలుపుగ శిష్యుండ నభవుపూజాపరుఁ డై
     యెలమి నష్టాంగయోగము, లలవడి తన్మయత నంది యానందించున్.

చ. యమనియమాదియోగము లహర్నిశమున్ సలుపంగఁ గొంత చి
    త్తము విమలత్వమంది వితతస్ఫురితేంద్రియజాలభీషణా
    క్రమ మడఁగంగఁ బూర్వ ఘన కల్మషదూరతచే యనంతత
    త్వము మది నాటఁగాఁ దనదుభావమునన్ గనియెన్ సదాశివున్.

గీ. అట్టిననుగూర్చి జలదంకిపట్టణమున, నున్న జానకి రామేశుఁ డొయ్యనొయ్యఁ
   బలికె నీచేత నుడువగాఁబడినకృతికి, నన్ను నధినాఁథుఁ జేయు మటన్న నలరి."

ఇట్లుగా నున్నగ్రంథములోని కవిత్వ విశేషాదులు తెలుపఁజాలు నన్ని పద్యముల నీవఱకే వివరించియున్నాఁడను, కావున నీచారిత్ర మింతటితో వదలెదను.