పుట:Kavijeevithamulu.pdf/694

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

688

కవి జీవితములు.

రనుతెట్టుసంస్థానీకుల వంశచారిత్ర మీగ్రామములో నున్న పైవేజెళ్లవారి ద్వారమున సంపాదింపఁబడిన వంశావళీగ్రంథము పట్టాలనుబట్టి సంగ్రహింపఁబడినది. దానివలన పై వృత్తాంతము కొంత తేలుచున్నది. కావున నీసమయములో నవసర మగువృత్తాంతము నీక్రింద వివరించెదను.

వేజెళ్ల వారివంశావళి.

పోలంరాజు.

|

పాపరాజు (శా. స. 1371-1416)

|

కసవరాజు (శా. స. 1416-1444)


పైవారిలోఁ బ్రస్తుతములో మనకుఁ గావలసినవారిపేరులు కాలమును గైకొందము. వా రెవ్వరనఁగా నఱ్ఱాజు నతని యన్న యగునయ్యపరాజును. వీరి కాలము శా. స. 1416 మొదలు 1444 వఱకు నిరువది యెనిమిది సంవత్సరములై యున్నది. వంశావళీసంగ్రహములో వీరివృత్తాంత మీక్రిందివిధంబుగా నున్నది. ఎట్లన్నను :_

"అయ్యపరాజు హైద్రాబాదునకుఁ బోయి అక్కడి నుండి పూర్వము 'కొడగు చక్రవర్తి' అనురెడ్డికి జాగీరుగా నడుచుచున్న గుడ్లూరు సీమకు జాగీరు తెచ్చుకొని తన తమ్ముఁడు సర్వరాజును హైద్రాబాదులో నుంచి తాను సోమరాజుపల్లె యనుగ్రామములోఁ గోట కట్టుకొని జాగీ రనుభవించెను."