వెన్నెలకంటి వేంకటాచలము.
681
1150 సం. వఱకు నుండుననుటకు సంశయము లేదు. అతనిపుత్త్రుఁడు నన్నయ యను నతఁడు శా. స. 1150 మొదలు 1200 వఱకు నుండి యుండును. అతనికుమారుఁ డగుజక్కయకవి యేఁబదిసంవత్సరముల వాఁడే అయిన 1250 వఱకుగాని అంతకు నధికవయస్సువఱకు నుండిన శా. స. 1270 లేక 1300 వఱకుగాని యుండుటకు సందియముండదు. ఇది కృతిపతి యగు సిద్ధనకాల మై యుండినట్లుగా నీవఱకే మనము లెక్కించినారము ఆకారణమున నితఁ డెఱ్ఱప్రెగ్గడకుఁ గొంచెము దరువాతివాఁ డగుననుటకు సందియముండదు.
23.
వెన్నెలకంటి వేంకటాచలము
(కృష్ణవిలాసకవి)
ఇతఁడు నాఱువేలశాఖానియోగిబ్రాహ్మణుఁడు. హరితస గోత్రుఁడు. జగ్గనామాత్యునిపుత్త్రుఁడు. ఇతనివంశావళి వివరించుటకుఁబూర్వ మితనవలన వివరింపఁబడిన యాశ్వాసాంతగద్యమును వివరించెదను. ఎట్లన్నను :_
"ఇది శ్రీమదుమామహేశ్వర వరప్రసాదలబ్ధ శంకరభజనానంద ములుగు గురులింగారాధ్య పాదారవింద ధ్యానపరాయణ హరితసగోత్ర సుజనవిధేయ జగ్గనామాత్యపుత్త్ర వెన్నెలకంటి వేంకటాచల నామధేయ ప్రణీతం బైనకృష్ణవిలాసం బను మహాప్రబంధంబునందు"
ఆంధ్రగీర్వాణకవివర్ణనము.
ఈకవి యొకసీమలోఁ గొందఱఁ బ్రాచీన సంస్కృతకవులను మఱికొంద ఱాంధ్రకవులను గలిపి చెప్పియున్నాఁడు. ఇది యితరకవులలోఁ జూడఁదగుమార్గముకాదు. ఆపద్యమెట్లున్నదన :_
"సీ. కాళిదాసునిఁ దిక్కకవి నన్నపార్యుని, భారవి భవభూతి పాండుసు కవి
మల్హ ణు బిల్హ ణు మాఘు మయూరుని, చోరుని నాచనసోము భీము
పింగళిసూరన్న పెద్దనామాత్యుని, పొలుపొంద బమ్మెరపోతరాజు
వంచేటిరంగన్న భాస్కరణమంత్రిని, వెల్లంకితాతప్ప మల్లుభట్టు
తే. మహిమమీఱంగ నాస్థానమంటపముల, సకలరాజులచేతను సన్ను తింపఁ
బడినసుకవుల నందఱఁ బ్రస్తుతింతు, నింపుమీఱంగఁ గృతి రచియింపఁబూని."
`రంగ
</poem>