పుట:Kavijeevithamulu.pdf/686

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
680
కవి జీవితములు.

జక్కనతండ్రివిషయము.

"క. అడఁడు మయూరరేఖను, గాడంబాఱండు బాణగతి మన మెరియన్
     బ్రోడగుపెద్దయయన్నయ, మాడకు మాడెత్త యతనిమాటలు జగతిన్.

క. అని మీతండ్రిమహత్వము, జనవినుతరసప్రసంగసంగతకవితా
    ఘనతేజులు కవిరాజులు, గొనియాడుదు రఖిలరాజకుంజరసభలన్."

జక్కనకవివర్ణనము.

"క. చక్కన నీవైదుష్యము, చక్కన నీకావ్యరచన చాతుర్యంబుల్
     చక్కన నీవాగ్వైఖరి, చక్కన నీవంశమహిమ జక్కనసుకవీ.

క. స్వాభావికనవకవితా, ప్రాభవముల నుభయభాషఁ బ్రక్ఖాణింపన్
    భూభువనంబుల సరిలే, రాభారతి నీవుఁ దక్క నన్నయజక్కా."

ఇట్లున్న జక్కనకవివంశచారిత్రములో మనకుఁ దేలవలసిన యంశ మొకటియున్నది. అది నెల్లూరితిరుకాళరాయని కాలవివర మై యున్నది. ఇది తేలినయనంతరమే జక్కనకవి కాలమును తేలఁగలదు. దానిం గూర్చి గ్రంథాంతరములఁ జూడవలసియున్నది. లోకల్‌రికార్డులు 5 సంపుటము 27, 28 పుటలలో (Local Records Vol V. P. 27 & 28) నీక్రింది విధంబున నున్నది.

"తిరుకాళతి చోళమహారాజు రాజ్యభారముచేసిన తరువాతను, గణపతి దేవ మహారాజులు రాజ్యభారం యేలుతూవుండఁగా వారిఅగ్రసేనాపతి గంగయదేవమహారాజు సిద్ధవటం, పొత్తపినాటి మొదలగు సీమలు ప్రభుత్వము చేయుచుండి అప్పుడు తాలూకు మజుకూరు, పరగణే దువ్వూరిపైకి మవుదుకూరు అను గ్రామమం దుండిరి."

అని యున్నది. దీనింబట్టి కాకతీయగణపతి దేవుని రాజ్యమునకుఁ బూర్వము తిరుకాళచోడమహారాజు పైసీమను బాలించుచున్నట్లు గాన్పించును. కాకతీయులవంశచారిత్రముంబట్టి యాగణపతిరాజుకాలము శా. స. 1053 సంవత్సరమునకు బిమ్మట నైనట్లు స్పష్టమే. కావున నతనికిఁ బూర్వుఁ డగుతిరుకాళచోళమహారాజుకాలము శా. స. 1053 నకుఁ బూర్వమే అయియుండును. ఆరాజుపైఁ గృతులిచ్చి విఖ్యాంతిం గాంచిన పెద్దనకవి ఆసమీపకాలములో ననఁగా 1050 మొదలు