పుట:Kavijeevithamulu.pdf/674

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

668

కవి జీవితములు.

గోడలి పెనిమిటియగు వీరభద్రభూవిభునికాలంబులో నీతని కతిసమీపంబుననున్న యీ రావూరి రాఘవరెడ్డికాలములో ముదుసలియై యున్నట్లూహించుట సహేతుకమైయుండును గాని పంతులవారూహించినట్లుకాదు. ఇఁక పంతులవారు కనిపెట్టిన రెండవమార్గముకూడ సరియైనది కాదని తోఁచుచున్నది. అది తిరుమలతాతాచార్యులంబట్టి యతని మనుమని శిష్యుండగు నీరాఘవరెడ్డి కాలము నిర్ణయించుట. దీనింగూర్చి యిదివఱకే నాయభిప్రాయము నిచ్చియున్నాను. ఆపద్యములనే తిరుగఁ బరిశీలించి చూపెదను. అందు పంతులవా రుదాహరించినయొకపద్యములో తిరుమలతాతయ్య అనుమఁ డగుసింగరాచార్యునిశిష్యుఁ డీరాఘవ రెడ్డి యని యున్నదిగాని షష్ఠ్యంతములలోని మఱియొకపద్యములో "తిరుమల తాతయదేశిక వరశిష్యునకు" నని యున్నది. దీనింబట్టిచూడ నీరాఘవరెడ్డి ప్రథమములో తిరుమలతాతాచార్యునివలన మంత్రోపదేశమునంది యున్నట్లు గాన్పించు. ఆకారణమున నతని తండ్రి యగునరసింహాచార్యుని (సింగరాచార్యులు) తన పరమ గురునిగా భావించినట్లు కాన్పించు, అదెట్లన్నను :-

"క. తిరుమలతాతయవంశా, భరణశ్రీసింగరార్యపరమగురుకృపా
      పరిపూర్ణహృదయ యాచక, వరచేతఃకమలినీదివాకరమూర్తీ." ఆశ్వా-8-చివర

పైనృసింహాచార్యులు మహామహిమావంతుఁ డైకర్ణాటప్రభుండగువిరూపాక్షరాయలను శైవమతమునుండి వైష్ణవమతములోనికి మార్చినవాఁడు. అంత నారా జీనృసింహాచార్యునకు శిష్యుఁడై యుండి విరూపాక్షముద్ర వదిలె ననియు నాకారణమున నావంశపురాజులకు రాజ్యభ్రంశము కల్గెననియు రాయలవంశ చరిత్రములో నున్నది. ప్రపన్నామృతములోఁగూడ నీనృసింహాచారింగూర్చి యీక్రిందివిధంబున వ్రాయంబడినది. దానినే మఱియొకపరి వివరించెదను. ఎట్లన్నను -

శ్లో. విరూపాక్ష స్తతో ధీమా న్వీరశైవమతో౽పి సః,
    శ్రీశైలవంశసంభూతా జ్ఞాత్వా తా రామలక్ష్మణౌ.