664
కవి జీవితములు.
లేవు. పూర్వకాలములో గుడ్లూరు మొదలగుసీమలు అదొండుఁ డను చోళచక్రవర్తి పరిపాలనలో నున్నట్లు తెలియవచ్చును. అతనికే యీ కొడగుచక్రవర్తి యనుపే రీదేశస్థులవలన వాడఁబడెనేమో తెలియదు.
కవిచరిత్ర పై విమర్శనము.
బ్ర. కందుకూరివీరేశలింగము పంతులవారు తమ 'ఆంధ్రమధ్య కవుల' చరిత్రములో (రెండవభాగములో) నీవెన్నెలకంటి సూరకవి కాలము మఱియొకటిగా నిర్ణయించిరి. వారికిని మాకును పైవిష్ణుపురాణములోని యాధారములే కాని వేఱుసామగ్రితోఁ బనిలేదు. కావున వారు నిర్ణ యించినకాలము సరియైనది యవునా కాదా యని పరిశీలించవలసి యున్నది. అట్టిపని చేయుటకుఁ బూర్వ మాంధ్రదేశములోని వివిధఖండములను బాలించిన రెడ్లవంశము లెన్ని యున్నవో, వారిలో వారికిఁగలసంబంధము లెట్టివో చూపవలసియున్నది. ఆవివరము దేశచారిత్రోపయోగముగా నీవఱకే నావలన మఱియొకసందర్భములోఁ గొంచెము విపులముఁగా వివరించఁబడియున్నది. దాని సంగ్రహమైన నిచ్చో వివరింపకున్న నీ విష్ణుపురాణము కృతినందినరెడ్లవంశావళిలో వివరింపఁబడిన యితర రెడ్లసంబంధములు తేలవు కావున నావంశావళుల నిట వివరించెదను
1. ఆంధ్రహరివంశములోని యొక రెడ్డివంశావళి.
పంటకులములో