పుట:Kavijeevithamulu.pdf/662

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

656

కవి జీవితములు.

"క. యాచమహీపతివలువలు, గోఁచులకేఁ గాక కట్టుకోకల కగునా
     రేచెర్లగోత్రమందున, నీచుఁడు జన్మించి కులము నీఱుగఁ జెఱిచెన్."

అని యిట్లుత్తరంబిచ్చిన కవికిఁ గల్గిన కోపకారణం బారా జడిగిన నాతం డిట్లనియె. ప్రభువులకు విద్యావిశేషంబులుండవలయు నని యనుటకుఁ గారణము తమకడ కరుదెంచు విద్వాంసుల యోగ్యతల దెలిసి వారికి యథోచిత సత్కారంబులఁ జేయుటకుఁ గాని వారు స్వయముగ కక్షగట్టి పండితుల నలయించుటకుఁ గాదు. ఒక్కొకవిద్యలోఁ బెక్కేండ్లు గడపి గురుకులవాసంబుచే విద్యనేర్చిన పండితోత్తములఁ బరీక్షింప దానిలోఁ గొంచెము దీనిలోఁ గొంచెము తెలుసుకొనినవారితరంబగునే? అట్లుగాఁ దనబలంబు నెదిరిబలంబు నెఱుఁగక పండితుల నలయింప వారి కాగ్రహంబు రాక అట్టివారియెడ ననుగ్రహం బేల కలుగు? 'సాధుసజ్జన సంతాపా త్కి మాశ్చర్యం కులక్షయే' అనియుండుటంజేసి యట్టివారు పడినపరితాపం బూరక పోవునా ? అట్టి పరమసాధులలో నొక్కండును షట్ఛాస్త్రపారంగతుండునగునీపండితశిఖామణి వచ్చినపుడీ యాస్థానములో నాతనికిఁ గల్గినయవమానంబే యిపుడీప్రత్యవమానకారణంబు. ఆ పండితుఁడు దయాళుండు గావున నీసంస్థానంబున కొకొకీడు తలంపక నీవలనం గల్గినయవమానమునకు సమమగునవమానం బే కోరి నన్నుంబిలిచి తెచ్చె. ఆకారణంబుననే నంతకు నోనాడనైతి. కావున నీవుచేసినది మహాపచారంబగు. నావిప్రశిఖామణిం బ్రసన్నుం జేసికొమ్మనుడు రాజుపశ్చాత్తప్తుం డై ఆపండితశిఖామణి దిక్కు మొగంబై యిట్లనియె. ఎఱిఁగియొ యెఱుఁగకయో మీయెడ మహాపరాధంబు గావించితి. దానిని సహించి నన్నుఁ గరుణింప నీకవిశిఖామణిం బ్రసన్నుం జేయుఁ డనుండు నాతండు మహాప్రభూ మేమందఱ మీశ్రేయస్సుఁ గోరినవార మవుటంజేసి యిక్కడ జరుగుచుండుదురాచారంబు నివారింప ని ట్లొనర్చితిమిగాని మీయెడఁ గోపంబు లేదు. అట్టియుద్దేశంబుతోడ నీదత్తప్పకవిశిఖామణియు వచ్చియున్నాఁడు. అతఁడు నైసర్గికముద దయాళుఁడు నీయెడ నొకకోపంబుదెచ్చుకొనునే? యనుడు రాజాయిర్వురఁబూజింతు నని యిర్వురకును విశేష బహుమతు లొనర్చె. అపుడు దత్తప్పలేచి తనబహుమతులఁ గూడ నా పండితున కిచ్చి రాజుకడ ననుజ్ఞాతుం డై బండితుని వెంట నిడుకొని స్వ