పుట:Kavijeevithamulu.pdf/660

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

654

కవి జీవితములు.

వచ్చినయవమానం బీతనిదొక్కనిదేకాదు. ఇది మనయందఱిదియు న నగును. ఇట్టియవమానంబులనే యాచమనీఁ డనేకులకుం జేసియున్నట్లు చిరకాలమునుండి వినుచున్నాము. ఒక్కపరి తగిన వారివలన నతకిఁ బండితగౌరవము దెలిసినంగాని యిట్టి ద్రోహచింత యతనికి మానదు. కావున నీవు మిక్కిలి త్వరతో బయలు వెడలియీపండితుని వెంటం బోయి యాతనికార్యంబు సానుకూలంబుజేసి రావలయును. అని యన్నగా రనుజ్ఞయయినం గని దత్తప్ప చిత్తమని తనప్రభునికడకుం జని రామేశ్వరతీర్థయాత్రకుఁ బోయివచ్చెద నని యనుజ్ఞఁగొని నాఁటి రాత్రియే బయలుదేఱి పండితుని తనవెంటనే యుంచుకొని మఱికొన్ని దినంబులకు యాచమహీపతి యున్న పట్టణంబునకు వచ్చి చేరెను.

దత్తప్పకవి యాచమహీపతిసభకుం బోవుట

ఇట్లు వచ్చి దత్తప్పయుఁ బండితుఁడు నొకబ్రాహ్మణగృహంబున విడిసి మఱునాఁ డుచితవిధంబున నాంధ్రకవి వచ్చియున్నాఁ డని యాచ భూపాలునకు వర్తమానంబుపంచె. ఆవృత్తాంతము విని యాచమనీఁడు తనకడ నున్నపండితు లావఱలొ నేర్పర్చియుంచినదుష్కరప్రాసయుక్తము లగుననేకపద్యసమస్య లున్న గ్రంథమును సిద్ధముగా నుంచికొని కవీశ్వరుండు రావచ్చు నని యాజ్ఞనొసంగె. ఆదత్తప్పకవియును బండితుని వెంట నిడుకొని ప్రభుదర్శనమునకుఁ బోయె. అపుడు యాచమనాయఁడు తూఁగుటుయ్యలపయి నుండి యితఁడేనా ఆంధ్రకవి యని తనసన్ని ధానవర్తులతోఁ బ్రస్తావింప వా రగుననితెల్పిరి. అట్టివార్తవినియైన నాకవికి దండ ప్రణామాదుల నొనరింపక కూర్చుండుటకైన సెలవొసంగక ఆకవి యూరుం బేరును దెలిసికొనునుద్దేశంబునఁ గొన్ని సంప్రశ్నంబులు చేయనారంభించె. దానిందెలిసికొని కృద్ధుండై దత్తప్పకవి నిలువంబడియే యుండె. అపుడు యాచమనీఁ డితఁడేనా కవియనె. ఆమాట విని దత్తప్పకవి పరీక్షించు పండితప్రభుఁ డున్నచో నీతఁడే కవి యగు నని తెల్పె. దానికి యాచమనీఁ డల్గి 'యేయూరో' అని ప్రశ్నించె. దానికి సమాధానముగా 'తెట్టు' అనుడు 'మఱో' యని ప్రశ్నించె. దానికి సమాధానముగా దత్తప్ప 'కుమారకృష్ణవసుధేశ్వరనందనరాజ్యలక్ష్మికిం బట్టు' అనుడు 'మఱో' 'మఱో' అని యడిగెడు యాచమనీని ప్రశ్నములకు సమాధానముగా