పుట:Kavijeevithamulu.pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

652

కవి జీవితములు.

నులు వచ్చి నన్ను బ్రార్థించి స్వదేశంబునకుఁ దోడి తెచ్చిరి. ఇంటఁ బ్రవేశించినది మొదలుగృహకృత్యములు నేనే జరుపవలసినవాఁడ నగుటం జేసియు దానికిఁ దగువృత్తిస్వాస్థ్యములు లేకుండుటం జేసియు విద్యాధికులగుప్రభువుల నాశ్రయించి నాదరిద్రము వావు కొనియెద నని నిశ్చయించుకొని అట్టివిద్యాప్రభువు లెవ్వరు గల రని విచారింపఁగా బెక్కండ్రు వెలుగోటియాచమనాయఁ డనుమహాపురుషుఁ డున్నాఁడనియు, నాతఁడు విద్వత్పక్షపాతియనియు, నతనియాస్థానంబున ననేకులు విద్వాంసు లున్నారనియు, పండితుఁడని వినిన వారిని మిక్కిలి గౌరవించు ననియుఁ జెప్పిరి. అట్టివృత్తాంతముం దెలిసికొని మనంబున నెంతయు నలరి నాదరిద్ర విచ్ఛిన్న మగుసుకాలంబు సంప్రాప్తమయ్యె నని నిశ్చయించుకొని ఆశాపిశాచ ముత్సహింపఁ జేయుచుండ దూరమని యాలోచింపక రాత్రింబగలు నడిచి యతిత్వరలో నతని ముఖ్యపట్టణమునకుఁ బోతిని. అక్కడి పండితుల నాశ్రయింప వారు నాదైన్యముం జూచి కరుణించి ప్రభునితో విన్నవించి నన్నుం దోడ్కొనిపోయి ప్రభుదర్శనంబుఁ జేయించిరి. నేనునుఁ బ్రభు నాశీర్వదించి ఫలమంత్రాక్షతల నిచ్చి యుండుతఱి జరిగినవృత్తాంతంబు జెప్పుటకు సిగ్గును దుఃఖముగల్గుచున్నదని తలవాంచికన్నీరు నించుచుఁ గొంత తడ వుండిన వెంకన్నకవి యాపండితుం దేర్చి స్వామీ మీయట్టిమహావిద్వాంసు లిట్లు పామరులవలె వ్యాకులచిత్తు లగుట న్యాయమగునా ? ధైర్యముఁ బూని యనంతరవృత్తాంతంబు నివేదింపుఁడు. నా కున్న శాంతంబు సంతంబు నందునదియైయున్నది. అనుడు నాబ్రాహ్మణుఁడు కొంత వడికిఁ దేఱి యిట్లనియె. కవివర్యా విద్వత్ప్ర భుం డని నేను జూడఁబోయిన నామహామహుడు సామాన్యగౌరవప్రవత్తులైనంజేయక యేవచనప్రయోగంబుననే నాయూరుం బేరు నడిగి తెలిసికొని నీ వాంధ్రంబున నెంతవఱకు వ్రేలు పెట్టినావోయీ? అందులో సమస్యలఁ బూర్తిచేయఁగలవా? అని ప్రస్తావింప నారంభించె. అట్టివాక్యములకు నామనం బెంతయు సంచలించుచుండఁ గార్యవాదులకు గర్వముతోఁ బనియే మని నిశ్చయించుకొని యాప్రభున కిట్లుత్తరమిచ్చితిని. నేనాంధ్రపండితుఁడను కాను. సంస్కృత