పుట:Kavijeevithamulu.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

651

నములకుఁ బోయి తనవిద్యావిశేషములఁ జూపుచుండుటయు నచ్చటచ్చట ననేకబహుమానంబు లంది వచ్చు చుండుటయుఁ గలదు అ ట్లతఁ డితరసంస్థానములకుఁ బోయి చేసిన విద్యావ్యాసంగములలో నొకసమయమునఁ బైరావు యాచమనాయని సభలోఁ జేసినయొకకార్యము మిక్కిలి ప్రసిద్ధినొందెను. ఆకథనుమాత్రము వివరించి మోచర్లవారి గాథను వదలెదను.

ఒకపండితునికథ.

"ఒకదినమున నొకబ్రాహ్మణుఁడు మండువేసవిగా మధ్యాహ్నసమయంబున నీమోచర్లవారియింటికి వచ్చె. అపుడు వార లాతని నభ్యాగతునిగా భావించి యుచిత సత్కారంబులఁ జేసి యామాధ్యాహ్నిక కార్య మచటనే కావింపఁ బ్రార్థించిరి. ఆపండితుఁడు నటులనే చేయుటకు సమ్మతింప వెంకన్నకవి వెంటనే లేచి యతనిఁదోడ్కొని చని స్నా నాదికములం దీర్ప నందఱు భోజనమునకుం గూర్చుండిరి. అంతట వెంకన్నకవి యప్పండితునకు హస్తోదకం బిచ్చి కైకొమ్మనుడు నాబ్రాహ్మణుఁ డట్లుచేయక తలవాంచి యూరకుండె. దానింజూచి యతని కెద్దియో కోర్కెగలదనియూహించి "అభ్యాగతస్స్వయంవిష్ణుః" అనియుండుటంజేసి మీయభీష్టం బెద్దియోయదిపడయవచ్చు ననుటకుసందియంబు లేదు. దానిం జెల్లింతును హస్తోదకంబు గైకొమ్మనుడు నాపండితుఁడు నాయభీష్టవరంబు దయచేసితిరి కావునం గైకొనెద నని హస్తోదకంబు గై కొనియె. అపుడు వారందఱు నుచితాలాపంబు లాడుచు భోజనంబులుగావించిరి. భోజనానంతరము తాంబూల చర్వణార్థము రండని వెంకన్నకవి యాబ్రాహ్మణుని మేడపైకిం గొనిపోయి యతని నుచితాసనంబున నునిచి ఆయన వృత్తాంతంబును, వచ్చినకార్యంబును దెలుపవేడఁగా నాబ్రాహ్మణుఁడు విన్నంబోయిఅ వదనంబున నాకవివర్యున కిట్లనియె. ఓకవికులావతంసా ! నావంత యొక్కింత చిత్తగింపుఁడు. నే నొకపేదబ్రాహ్మణుఁడను. చిన్నతనముననే వారాణసికిం బోయి యిరువది ముప్పది సంవత్సరములు గురుశుశ్రూష చేసి కష్టించి షట్ఛాస్త్రములను గొంతవఱకు నేర్చికొంటిని. అంతట స్వజ