పుట:Kavijeevithamulu.pdf/656

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

650

కవి జీవితములు.

వారి కుటుంబమొకటియు, మోచెర్లవారికుటుంబ మొకటియు నొక కాలములోఁ గవిత్వమునకు మిగులఁ బ్రసిద్ధి కెక్కినకుటుంబము లనియు నాయిర్వురలోనే కవిత్వ విద్య నిలిచి యుండె ననియుఁ దేలినది. అట్టి వారిలో నిర్వురు మువ్వురు ప్రసిద్ధు లున్నట్లును వారిసమీపబంధువులై నట్లు తేలును. అందు మొదటివాఁడు సూర్యకవి. మఱియొకఁడు పైసూర్యకవి తమ్మునికొడుకైన విక్రమార్క చరిత్రములో వివరించఁబడిన వెన్నెలకంటిసిద్ధన యొకఁడును, నీ సూరకవి యొకఁడు నై యున్నారు. ఇఁక మోచెర్లవారింగూర్చి వ్రాయవలసియున్నది. వారిలో వెంకన్న, దత్తప్ప లను కవు లిర్వురుమాత్రము మనమెఱిఁగినవారు. వారిగ్రంథములు వ్యాపకములో లేవుకాని వారిసమస్యాపూరణములు పెక్కులు గలవు. ఆపద్యప్రశంశసేయుటకుఁ బూర్వము పై రెండుకుటుంబములకుఁ గలప్రత్యక్షసంబంధము వివరింపవలసి యున్నది. ఆసంబంధము దౌహిత్రసంబంధ మని చెప్పఁ దగియున్నది. అందులో నెవ్వరి కెవ్వరు దౌహిత్రులోఁ జెల్పఁజాలము కాని పై పద్యానుసారముగాఁ గవితాకన్య వెన్నెలకంటి వారియింటఁ బుట్టి మోచెర్లవారి యింటికోడలైనదని చెప్పంబడుటచేత వెన్నెలకంటి వారి కన్యకను మోచెర్లవారి పిల్లని కిచ్చి వివాహము చేయఁబడియుండవచ్చు నని తోఁచును. పైవెన్నెలకంటి కవులలో నెవ్వరిపుత్త్రికాసంతానములోనివారు మోచెర్లకవులో దానిని నిర్ణయింపలేము. వెన్నెలకంటి వారిలో ననేకులు కవు లున్నా రనుచో నిమొచర్లవా రెవ్వరిదౌహిత్రులో దాని నిర్ణయింప వీలులేదు. అట్టి మోచెర్లవారిలో నిర్వురుకవులు బహుప్రసిద్ధులు. వారిపేరులు వెంకన్న, దత్తప్ప. వీరు రావు యాచమనాయని కాలీను లని యుండుటచేతఁ పై కవులందఱికి వీరు మిగుల దూరస్థులుగాఁ గాన్పించెదరు.

మోచర్లవారివిషయము.

పై మోచర్ల వెంకన్న, దత్తప్పకవులు 'ఏజళ్లవారు' అను తెట్టు జమీందారుల యాస్థాన కవీశ్వరులు. వారిలో వెంకన్న యనునతఁడెల్లప్పు డాస్థానమునే కనిపెట్టియుండుటయు దత్తప్ప యితరరాజుల సంస్థా