పుట:Kavijeevithamulu.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

641

భద్రవిజయగ్రంథకవి పరాకు జెందినందులకు నాలోచించెదను. ఇప్పటి కీపూర్వపక్షము వదలెదను. ఇఁక నీశ్వరుఁడు సతీదేవివృత్తాంత మెఱింగినసందర్భముం బరిశీలింతము. అదియెట్లన్నను. -

"సీ. కైలాసగిరిమీఁద కరకంఠుఁ డొక నాఁడు, కరమొప్పఁ గొలువుండి గౌరిఁ దలఁచి
      యిదియేమి రా దయ్యె నియ్యేణలోచన, యని యవ్విధంబెల్ల నంత యెఱిఁగి
      సుందరి తనకుఁ గూర్చుటయెల్ల భావించి, శంభుండు మనమునఁ జాల నొచ్చి
      యిదియేమి తా నంపితిని దక్షునింటికి, మీనాక్షి తా నేల మేనువాసె

తే. పొలఁతి తన్ను నేను పొమ్మని తఱిమినఁ, బోవనొల్ల ననియెఁ బువ్వుబోఁడి
    పంకజాక్షి నొంటిఁ బంపినకతనఁగా, వెఱ్ఱితనము వచ్చె వేయునేల.

వ. అని మఱియును పరమేశ్వరుండు గౌరీదేవి ననంతకరుణామాసుం డై తలంచి వెండియుఁ దనమనంబున.

మ. పుడమిన్ రాజ్యముఁ గోలుపోయి తగ నేడ్పుం బొంది శోకించున
     జ్జడధీశాత్మకుఁ డైనయింద్రునకు దా జన్మించి రోషాంబుధిం
     బడ వైవస్వతమన్వు నాఁడు ముదమొప్పన్ రాజ్యముం జేయఁగా
     గడతేర్తు న్నని పాపదక్షునకు వేగన్ శాపమిచ్చెన్ వడిన్.

వ. ఇట్లు పరమేశుండు శాపంబిచ్చిన దక్షుండు తదీయప్రకారంబున నుండె నంత."

అని దక్షయజ్ఞ వృత్తాంతము ముగించఁబడినది. ఆహా! యేమి యీకవికథాసందర్భనైపుణి. రుద్రునంతటివానిభార్య నవమానించి చచ్చునట్లుగాఁ జేసినదక్షున కవుడే రుద్రునివలన శిక్ష కలుగునట్లుగా వచియింపఁబడక అనేక మన్వంతరము లైనపిమ్మట వచ్చెడువైవస్వతమనువు కాలములో నీదక్షు నీశ్వరుఁడు సంహరించెద నని చెప్పినట్లు కథ పొసఁ గించి తిరుగ దక్షునకు మఱియొక జన్మమును మఱియొక యజ్ఞమును గల్పించి అందులో నీశ్వరుఁడు ప్రస్తుత మన్వంతరములోఁ దక్షుఁడు జేసియున్న యపచారమునకుఁ గాఁ దనకు లేనిదీర్ఘక్రోధము మనసులో నుంచుకొని వీరభద్రుం బుట్టించి యతనివలన నానాఁటియజ్ఞమునకు వచ్చినదేవతలనందఱఁగూడ శిక్షించె నని చెప్పుట యెంతశ్లాఘనీయము ? పురాణములో నట్లుండెఁగావున నతఁడట్లుగాఁ జెప్పెనందు రేమో. భాగవతములోఁ బోతరా జాపురాణములఁ జూడకచెప్పెనా ? అట్లుగా నొకచోటఁ జెప్పి నం