పుట:Kavijeevithamulu.pdf/643

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

637

బుట్టినవాఁడుగాఁ గానిపించును. ఓరీ దక్షా, విడువరా, చేపట్టరా, వైర మొప్పదురా, శివుని దలంపరా, వద్దురా, దుర్మతీ, దురాత్మా, అని యొక సంపన్నుని కూఁతురు విద్యాబుద్ధులు గల్గియుండిన తనతండ్రిం గూర్చి యిట్లుగాఁ దుచ్ఛనంబోదన లుంచి చెప్పునా అనుదాని నాలోచింపఁగా నీతండు భాగవ గ్రంథకర్త కాక మఱియొకఁ డని స్పష్టము కాక పోదు. ఇఁక భాగవతములో శివమహిమ జెప్ప లేదనియుఁ దాను వీరభద్రవిజయములో శివమహిమఁ జెప్పెద నని చెప్పినపద్యములు పై మూఁడుకందపద్యము లయియున్నవి. ఆపట్టున మఱికొన్ని పద్యము లున్నవి. అవియును గ్రంథకర్తకుఁ గలశివభక్తివిశేషములం దెల్పును. గాని శివతత్త్వప్రతిపాదకములుమాత్రము కావు. ఈవిషయములో మనయభిప్రాయముతోఁ బని లే దని భాగవతములోనిపోతనామాత్యవాక్య విశేషములనే చూపెదను. భాగవతము చతుర్థ స్కంధము సతీదేవి వాక్యములో

"వ. ఇట్లు తండ్రిచే నాదరింపఁబడనిదై విభుం డైనయీశ్వరునందు నాహ్వాన క్రియాశూన్యత్వరూపం బైన తిరస్కారంబున రుద్రాభావం బైనయజ్ఞంబు గనుంగొని నిజరోషానలంబున లోకంబులు భస్మంబు సేయంబూనిన తెఱంగున నుద్రేకించి రుద్రద్వేషియుఁ గ్రతుకర్మాభ్యాస గర్విష్ఠుండు నగుదక్షుని వధియింతు మనుచు లేచిన భూత గణంబుల నివారించి రోషావ్యక్త భావణంబుల నిట్లనియె. లోకంబున శరీరధారులైన జీవులకుఁ బ్రియాత్మకుం డైనయీశ్వరునకుఁ బ్రియాప్రియులు నధికులు లేరు. అట్టిసకలకారణుండు నిర్మత్సరుం డైనరుద్రునందు నీవుదక్క నెవ్వండు ప్రతికూలం బాచరింపఁడు. అదియునుం గాక మిముఁబోటివారలు పరులవలనిగుణంబులందు దుర్గుణంబుల నాపాదింతురు. మఱియుఁ గొందఱు మధ్యస్థు లైనవారలు పరులగుణంబులయందు దోషంబుల నాపాదింపరు. కొందఱు సాధువర్తనంబు గలవారలు పరులదోషంబులనైన గుణంబులుగా ననుగ్రహింతురు. మఱియుం గొంద ఱు త్తమో త్తములు పరులయందు దోషంబు నాపాదింపక తుచ్ఛగుణంబు గలిగినను సద్గుణంబులు గాఁ గైకొందురు. అట్టిమహాత్ముల యందు నీవు పాపబుద్ధి కల్పించితివి. అని వెండియు నిట్లను. మహాత్ము లగువారల పాదధూళిచే నిరస్తప్రభావు లై జడస్వభావంబు గలదేహంబు నాత్మ యని పల్కుకుజనులగువారు మహాత్ముల నిందించుట కార్యంబు గాదు. అదియు వారి కనుచితం బగు నని వెండియు నిట్లనియె.