పుట:Kavijeevithamulu.pdf/640

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
634
కవి జీవితములు.

లాడువాడుక బ్రాహ్మణాది అగ్రజాతులలో నూండక కేవల మతినీచజాతులలోఁగూడ నుండునో యుండదో యని యూహింపవలసిన దై యున్నది. తనయింటికిఁ గూఁతురు వచ్చినపుడు పలుకరింపకుండుటయే తండ్రికిఁ గలయసూయం దెలుపుట. అది యెఱిఁగియున్న భాగవతకవి యగు పోతనామాత్యునియట్టిపెద్దగృహస్థుఁడు దానినెట్లు వర్ణించెనో చూడుఁడు.

భాగవత చతుర్థ స్కంధమున దక్షప్రజాపతి యజ్ఞము చేయునపుడు దాక్షాయణి పోవుట అనుకథలో

"వ. ఇట్లు కనుఁగొని యజ్ఞశాలం బ్రవేశించిన.

క. చనుదెంచిన యమ్మగువను, జననియు సోదరులు దక్క సభ గలజనులె
    ల్లను దక్షువలనిభయమున, ననయము నపు డాదరింపరైరి మహాత్మా.

క. మఱి తల్లియుఁ బినతల్లులు, పరిరంభణ మాదరింపఁ బరితోషాశ్రుల్
    దొరఁగఁగ డగ్గుత్తికతో, సరసిజముఖి సేమ మరయ సతి దానంతన్.

క. జనకుం డవమానించుట,యును సోదరు లర్థిఁ దనకు నుచితక్రియఁ జే
    సినపూజల నందక శో,భన మరసిన మాఱుమాట బలుకక యుండెన్."

అని యున్న పైపద్యమువలన భాగవతగ్రంథకర్తయొక్క మనోధర్మము బోధపడకమానదు. అది మొదలు సతీదేవి దేహము విడిచిన దనువఱకుఁ గలకథలో దక్షుఁడు మౌనముద్రాధారియై యుంచం బడెనే గాని యొక్క వాక్య మైన నల్పప్రసంగ మతనినోట నుండి వచ్చి నట్లుగాఁ జెప్పం బడదయ్యెను. తండ్రికిఁ గూఁతునెడలఁ గోపము లేక కేవల మల్లునియెడలనే కోప మున్నట్లుగాఁ జెప్పంబడెఁ గావునఁ గూఁతు నాతఁడు నిందించుట కవకాశము లేదు. ఇట్లు లేనిచో నిఁకఁ గూఁతునకు నల్లునియెడఁ గలుగు ననురాగాతిశయమునకు నిందింపవలయును గాని మఱియొకవిధమున నిందించుటకు వీలుపడదు. అది పతివ్రతాలక్షణమేకావున శ్లాఘ్యకార్య మని దక్షుండు కూఁతు నిందించినట్లు చెప్పంబడలేదు. ఇఁకఁ దనకూఁతు నుపేక్షించి యూరకొనుటలో నాపెకుఁ దండ్రి గౌరవము చూపకుంటకుఁ గారకుఁ డగునీశ్వరుఁ డట్టివృ