పుట:Kavijeevithamulu.pdf/639

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

633

సీ. సతి సుహృద్దర్శ నేచ్ఛాప్రతికూల దుః,ఖస్వాంత యగుచు నంగములు వడఁక
    నందంద తొరఁగెడు నశ్రుతపూరంబులు, గండభాగంబులఁ గడలుకొనఁగ
    నున్నతస్తనమండలోపరిహారముల్, వేఁడినిట్టూర్పులవెచ్చఁ గంద
    నతిశోకరోషాకులాత్యంతదోధూయ, మాన మై హృదయంబు మలఁగుచుండ

తే. మఱియుఁ గుపితాత్మ యై స్వసమానరహితు, నాత్మదేహంబు సగ మిచ్చినట్టిధవుని
    విడిచి మూఢాత్మ యగుచు నవ్వెలఁది చనియె జనకుఁ జూచెడువేడుక సందడింప.

        వ. ఇ ట్లతిశీఘ్రగమనంబున.

సీ. మానిని చనుచుండ మణిమన్మదాది, సహస్రసంఖ్యాతరుద్రానుచరులు
    యక్షులు నిర్భయు లై వృషభేంద్రుని, ము న్నిడికొనుచు నమ్ముదిత దాల్చు
    కందుకాంజనశారికాతాళవృంతద,ర్పణధవళాతప్రతప్రసూన
    మాలికా సౌవర్ణమణివిభూషణఘన, సారకస్తూరికాచందనాది

తే. వస్తువులు గొంచు నేఁగి శర్వాణిఁ గదిసి, శంఖదుందుభివేణునిస్వనము లొప్ప
    మానితం బైనవృషభేంద్రయానఁ జేసి యజ్ఞభూమార్గు లై యర్థి నరిగి యరిగి."

అని యున్నది. పయిరెండుకథాసందర్భములఁ జూచినచోఁ గథాసందర్భ భేదము లుండుటయేకాక సందర్భోచితవర్ణన గలశైలి భాగవతములోనిది కా దనియు నాగ్రంథకర్త వియోగదుఃఖసమయములో నెట్టివర్ణన జేయవలయునో యిసుమంత యైనఁ దెలియని కేవలరసహీన హృదయము కలవాఁ డనియు నటుగావున నాతనికి 'రసమున కనుచితమగుపదవి రస మరీతి యనఁబరఁగు' అనునట్లుగా నాతనికవన మరీతిదోఁప యుక్త మై యుండు ననియుఁ జెప్ప నొప్పియున్నది.

5. ఇఁక దక్షుఁడు సతీదేవితోఁ జెప్పినవాక్యములు.

"క. నీనాయకుఁ డల్లుం డగు, కానీ నను ధిక్కరించెఁ గాన భవానీ
     మానుగఁ గనియును నీవును, కాననిగతి నుండనేల గర్వము నేలా.

క. చెలువా పిలువక ముందఱ, వలసరి మాయింటి కేల వచ్చితి చెపుమా
    పిలువని పేరంటము పని,గలవారును బోలెసిగ్గుగాదేరాఁగన్." వీర. వి. ఆశ్వా. 1.

అని యున్నపద్యములంబట్టి చూడ వీరభద్రవిజయగ్రంథకర్త కల్లునియెడఁ గోపము వచ్చియున్నపుడు కూఁతు నెట్లుగా గౌరవించవలయునో అపు డేయేమాటలు మాటలాడవలయునో లెస్సగా బోధయై యున్నది. ఇట్లుగాఁ బుట్టినయింటికిఁ గూఁతురు వచ్చినపుడు దుర్భాష