పుట:Kavijeevithamulu.pdf/636

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

630

కవి జీవితములు.

నాది శైవాచార వర్జితుఁ డై సర్వాద్వైతమతస్థులవలె నుండెను. కావున నీకవికి శైవవైష్ణవమతభేదములు లేక యాయుభయ మతములను గూర్చి ప్రత్యేకించి చెప్పవలసివచ్చినప్పుడు వారిలో వా రెట్లుగాఁ జెప్పుకొనియెదరో అటులనే చెప్పుచు వచ్చెను. దూషణులు వచ్చినపుడు వారు పరస్పర మెట్లు చెప్పుకొనియెదరో అటులనే చెప్పుచు వచ్చెను. ఇది పూర్తిగా నూహింపఁజాలనిశైవు లెవరో యొకకొందఱు పోతనామాత్యుఁడు శైవుఁ డై యుండియును వైష్ణవగ్రంథము చెప్పుటయేకాక శివదూషణ కూడఁ జేసియున్నాఁడు. అట్టిదోషనివారణముం జేయుట కాతని పేరిటనే శైవప్రధానగ్రంథము నొకదానిం జేసి యుంచిన లెస్స యని యూహించి యీవీరభద్ర విజయగ్రంథమును రచియించి నట్లు తోఁచెడిని యాగ్రంథము రచియించిన కవి సాధారణముగా నయిన ఆంధ్రకవిత్వము చెప్ప లేనివాఁ డవుటం జేసియు కథాసందర్భములఁ బొందుపఱుపలేనివాఁ డవుటం జేసియు నాగ్రంథమును తుదకు హాస్యాస్పదముగా రచియించె. అటులనే కాకున్న నీగ్రంథము పోతనామాత్యకృతము కా దని భేదించి చెప్పుట కవకాశమే చిక్కకపోవును. వీరభద్ర విజయగ్రంథకర్త కేవల శైవుఁడే యౌటంజేసి భాగవతరచనాదక్షుఁ డగుపోతనామాత్యునకుంగూడ వీరభద్రోపాసన యున్నదనియు వీరమాహేశ్వరకరుణ కలదనియు, తద్వీరమాహేశ్వరప్రధానుం డగుయివటూరి సోమేశ్వరగురుని శిష్యుం డై యుండి వారియాజ్ఞానుసారముగా వీరభద్రవిజయ మనుశైవగ్రంథమును రచియించె ననియుఁ గథం గల్పించె. దీని కనుగుణముగా నుండునట్లే దక్షుఁడు కైలాసమునకుఁ బోవునపు డచ్చో జరిగినశాపాదికముల వదలివేసి మఱికొన్ని భాగములలోఁ బెంచి వ్రాసెను. ఆభాగంబుల వివరించెదను. వీరభద్రవిజయ ప్రథమశ్వాసమున దక్షుఁడు రజతగిరి కరిగినకథలో

"క. చని గిరిమంది, రసన్నిధి వినయంబున నిలిచి యున్న వేడుక నతఁడున్ !
     మునులను సంభావించిన, యనువునఁ దను గారవించె నప్పుడు కరుణన్.

వ. ఇట్లఖిలభువనాధీశ్వరుండు సంభావించిన.