పుట:Kavijeevithamulu.pdf/635

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

629

చెడు. అదియును బోతనామాత్యుని నిష్పక్షపాతబుద్ధిని దెలియఁజేయునుగాని పోతనామాత్యునియెడల దోషారోపము చేయదు. ఆవాక్యము లెట్లున్న వనఁగా -

"వ. నందికేశ్వరు వచనంబులు విని భృగుమహాముని మరల శపియింపంబూని యిట్లనియె.

గీ. వసుధ నెవ్వారు ధూర్జటివ్రతులు వారు, వారి కనుకూలు లగుదు లెవ్వారు వార
    లట్టిసచ్ఛాస్త్రపరిపంథు లైనవారు, నవనిఁ బాషండు లయ్యెద రని శంపించె.

సీ. సకలవర్ణాశ్రమాచారహేతువు లోక,ములకు మంగళమార్గమును సనాత
    నము పూర్వఋషిసమ్మతము జనార్దనమూల, మును నిత్యమును శుద్ధమును శివంబు
    నార్యపథానుగం బగువేదమును విప్ర,గణము నిందించినకారణమున
    నేశివదీక్షయందేని మథ్యమపూజ్యుఁ, డైభూతపతి దైవ మగుచునుండు

తే. నందు మీరలు భస్మజటాస్థి ధార,ణములఁ దగి మూఢబుద్ధులు నష్టశౌచు
    లై నశింతురు పాషండు లగుచు ననుచు, శాప మొనరించె నాద్విజసత్తముండు.

వ. ఇ ట్ల న్యోన్యంబును శాపంబులం బొందియు భగవదనుగ్రహంబు గలవా రగుటంజేసి నాశంబు నొందరైరి."

అని చెప్పిన పోతనమాత్యు నెంతని కొనియాడవలయును ! ఇతఁ డొకఁడే యద్వైతి యని చెప్పవలదే ? శైవులకు వైష్ణవులును, వైష్ణవులకు శైవులును శాపము లిచ్చి రని చెప్పియు నీశాపము నిచ్చినవారిర్వురికంటెను దత్తన్మతప్రవర్తకు లధికు లగుభగవదవతారపురుషు లగుశివకేశవులు గావున వారివలన నిర్మింపఁబడినపాశుపత, పాంచరాత్రాగమ తంత్రమాహాత్మ్యంబు చెడక లోకంబున రెండును నేఁటివఱకును నిల్చియుండె ననుదాని నెంతసొగసుగ వ్యక్తీకరించెను ! ఇట్టిపోతనామాత్యునియెడ లోపముఁ దెల్పినవారు కేవలపాషండులే కానోవుదురు. అహా ! యది యట్లేగదా ! పోతనామాత్యుఁడు జన్మచేత శైవాచారపరుని కుమారుఁ డయినను [1] తనతాతముత్తాతల మతానుసారంబుగనే శైవమంత్రోపాసన మాత్రము చేయుచు లింగాంక

  1. పోతనామాత్యుని తండ్రినాఁడే శైవశాస్త్రమతము కల్గెనని భాగవతములోఁ బోతనామాత్యునిచేతనే 'మనియె శైవశాస్త్రమతముఁ గనియె' అని చెప్పఁబడియె.