పుట:Kavijeevithamulu.pdf/631

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

625

సత్కృతులను విననివాఁ డనియును జెప్పుట కవకాశ ముండు నని యూహించను. ఇంతియకాక వీరభద్రవిజయ గ్రంథకర్త దాను వీరభద్రోపాసనఁ జేసినాఁడ ననియుం జెప్పుచుండును. పోతనామాత్యుఁడు భాగవతములోఁ దాను పరమేశ్వరోపాసనఁ జేసినాఁడ నని చెప్పును. మంత్రశాస్త్రాను సారంబుగ వీరభద్రోపాసన కేవలము కామ్యమును, పరమేశ్వరోపాసన కేవలము మోక్షదాయకమునై యున్నది. కావున నీయుపాసనాభేదములు గలవా రిర్వురు నొక్క రని చెప్పుటకు సంశయము కలుగుచున్నది, ఇదియునుగాక పోతనామాత్యుఁడు శైవుఁడును శైవమంత్రోపాసకుఁ డయినను భాగవతమును దెనిఁగించుటకుఁ గలకారణముల నీక్రిందివిధంబున. జెప్పెను. ఎట్లన్నను :-

"వ. అని మఱియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనాకుతూహలుండ నై"

అని యొకచో వ్రాసి, మఱియొకచో

"ఇట్లు భాసిల్లెడుశ్రీమహాభాగవతపురాణపారిజాతపాదపసమాశ్రయంబున హరి కరుణా విశేషంబునఁ గృతార్థత్వంబు సిద్ధించె నని బుద్ధి నెఱింగి"

అనివ్రాసెను. పోతరాజును లీలాశుకుఁడు మొదలగువారింబలె శైవమంత్రోపాసకుండయినను వైష్ణవమహిమాను వర్ణనమునఁ దత్సంకీర్తనవలనను వైష్ణవుఁ డయినవాఁడుగాని శైవుండు గాఁడు. ఇట్టిదార్ఢ్య బుద్ధితో భాగవతముం దెనిఁగించి తనకుం గలభక్తిపారవశ్యముం జూపుచు నానందించుపోతనామాత్యునకు వాచాదోషము గలుగుటయుఁ దన్ని వారణార్థముగా నట్టిమతమును వదలుకొని తిరుగ శైవుఁ డయి వీరభద్రోపాసన జేసి యివటూరి సోమనారాధ్యుని సేవించి ఆయనసెలవుపయిని వీరభద్రవిజయము నాంధ్రీకరించుటయుఁ గలుగు నని చెప్పుట కంటె హాస్యాస్పదకార్యము మఱియొకటి లేదు. ఇట్లుగాఁ బోతనామాత్యుఁడు తనమతము మార్చుకొనుటయే కాక ఆశ్వాసాంతగద్యనుగూడ మార్చుకొనె నని చెప్పుట మఱియు హాస్యాస్పదముగా నున్నది. అది యెట్లనఁగా :-