పుట:Kavijeevithamulu.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

613

ఇందులోనితాఱుట అప్పకవిచేత శకట రేఫముగ ఱకారసీసమాలికలోఁ జెప్పంబడియె. "తాఱుమెకంబు లీతీరున" అని యప్పకవీయము. ఇది ప్రయోగంబులోమాత్రము లఘువులతోఁగూడియున్నది. 'దూఱు' అనునది యిచ్చోనున్న యర్థముంబట్టి శకట రేఫముగ నుండవలయును.

2. "ఇఱ్ఱి వెఱ్ఱియు" నని యిట్లు క్రింద జడ్జ లుండెడిలిపులెల్ల బండిఱాలు. వీనిద్విత్వము లొకవేళఁ బోయినం బోవును. 'జెఱిపోతు కఱిమేఁక గొఱియ యనఁగ' అని ముందు సూత్రము వ్రాసి పిమ్మట కొఱ్ఱశబ్దము లుప్తశేషమయినపుడు 'కొఱ' యని వ్రాయక 'కొర' యని లఘురేఫముతో వ్రాసెను. ఇది యితరలాక్షణికుల మతంబు గాదు.

3. 'ఱాదక్క సకలాక్షరములమీఁదను' అని రేఫసీసమాలికలో వ్రాసియున్నాఁడు. ఇందు 'ఱా' శకట రేఫసంజ్ఞికము.

"మ. పురుటింటం బసిబిడ్డచందమున వాపోవంగ నాఁ డాత్మలో
       మురువొప్పన్ విషదుగ్ధయుక్తకుచ యై ముద్దాడురాకాసి గు
       ర్తెఱిఁ గిష్టంబుగఁ బాలు ద్రావుమిషచే నిర్వైనకాలంబునం
       ధరణిం గూల్చి నందపుత్త్రువలనన్ దార్కాణ ధర్మస్థితుల్."

ఇందు నెఱిఁగిశబ్దము లఘు రేఫముతోఁజేర్చి బ్రయోగింపఁబడినది. 'ఈశబ్దమునకు రూపాంతరమును బద్యమునకుఁ బాఠాంతరమును గానరాదు.' అని ద్విరేఫవర్ణదర్పణకారులయభిప్రాయంబు. ఎఱుఁగుట శకటరేఫము గల దని యీ అప్పకవియే చెప్పియుండె. ఇంక నిట్టిపొరపాట్లనేకము లుండనోవు. ఇట్టి భ్రమప్రమాదంబుల కెడ మియ్యకుండున ట్లింకొకపద్యంబు వ్రాసె. అ దెట్లనిన :-

"క. బ్రమయక రేఫములకు రే, ఫములును ఱాలకును ఱాలు ప్రాసములను వి
     శ్రమములను జెప్పఁదగు నీ,క్రమ మెఱుఁగక రెండునుం గుకవిగూర్చుఁ గృతిన్."

అని యిట్లు వ్రాసి తానే యనేకస్థలంబులలో బ్రమసి యీరెంటిని వివేచింపలేక యొకదాని కొకటి ప్రయోగించె. ఇప్పుడు రేఫనియమన మప్పకవి తనయిష్టానుసారంబుగఁ జేసియుండియుం దాఁజెప్పిన