పుట:Kavijeevithamulu.pdf/612

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

606

కవి జీవితములు.

దానింజూచి రాజు కన్నులు మిఱుమిట్లుగొన శరీరంబు కంపింప నిశ్చేష్టితుం డయ్యె. ఇట్లుండి కొంతతడవునకుఁ దెలిసి యదియంతయుఁ పోతనామాత్య ప్రభావప్రకటనంబునకుఁ గా నాతనియిష్టదైవంబు చేసినచేఁతఁగా నెఱింగి యపరాధంబు సేసితి నని పోతనను దనమది నెంచి యపరాధక్షమ యని నమస్కరించె.అంత నావరాహం బంతర్ధానంబు నొందె. ఆరాజేంద్రుం డామంత్రిశిఖామణికడకుం జని యాతని యడుగుఁ దమ్ముల కెఱఁగి కర్ణాటుండ దీనుండ రక్షింపుఁడు. అనుఁడు పోతన యాతనిం గ్రుచ్చియెత్తి యాతని వృత్తాంత మడిగిన నాతం డిట్లనియె. "చెఱుపకురా చెడెద వ"న్నట్లు నిను నవమానింపఁదలంచి నేన యాపదలపాలైతి. సర్వబలంబులు సమసె. నీవాకిటికిటి నా కిటుల నగునటుల నొనర్చె. ఇదియంతయు భవదీయానుగ్రహాతిశయంబుచే నివారితంబు గావలయు. అనుపృథ్వీథపుపల్కు లాలించి కించి త్తాలోచించి భగవత్కృతం బని యెఱింగి యవమానంబునకు వగవకు మని యా రాజునోదార్చి యిట్లనియె. నీకు సర్వంబును మంగళం బగు. రమేశు ధ్యానింపుచుఁ గాలంబు గడుపు మనుఁడు నాతండు శ్రీహరిని తనహృత్సరసి జంబున నిల్పి ధ్యానింపుచుఁ బోతనామాత్యుమాహాత్మ్యంబు దలంచుచు నాయిలు వెడలె. అపుడు మోహనాస్త్ర విముక్తులభంగి నింగిముట్టఁ గోలాహలస్వనంబు సేయుచుభగవదనుగ్రహ దత్తంబులై యతనిసేన లుండ నాతండు కొలఁదికి మీఱినసంతసముఁ బొందితనయూరుసేరెనఁట.

భగవద్దర్శనము.

అనంతరము పోతనామాత్యుండు భగవద్భక్తి యుక్తుం డై చతుర్థాదిస్కంథంబులఁ దెనిఁగించి యష్టమస్కంధంబున గజేంద్రమోక్షణంబు వ్రాయుచు నందు గజేంద్రుండు స్వామిని రక్షించు మని పలుకఁగ నావచనంబులు వైకుంఠనాథుం డాలించె ననుచో "అలవైకుంఠపురంబులో నగరిలో నామూల" అని నుడివె. అంతట నేమియుం దోఁచకుండె. అపుడు తనకూఁతుం బిలచి తా వ్రాయుచున్న పొత్తం బాపె చేతి కిచ్చి యుదె వచ్చెద నని యొకనిర్జనప్రదేశంబునకుం జని తొంటివా